శంషాబాద్ ఎయిర్ పోర్టు పక్కన మెడికల్ హబ్ ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టు పక్కన మెడికల్ హబ్ ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

 సీఎం హోదాలో తాను నిత్యం 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎన్టీఆర్ ఆలోచనను కుటుంబ సభ్యులు కార్యరూపంలో పెట్టారని చెప్పారు. క్యాన్సర్ ను అరికట్టాలనేది గొప్ప ఆలోచన అని అన్నారు. 

భవిష్యత్ లోనూ బసవతారకంకు తోడుంటామని చెప్పారు. ఆస్పత్రి విస్తరణకు సహకరిస్తామని చెప్పారు. నిత్యం ఎంతో మందికి ఆస్పత్రి సేవలందిస్తుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పక్కన భూమి తీసుకుని మెడికల్ హబ్ గా పెద్ద ఆస్పత్రులు కట్టిస్తామని తెలిపారు. హైదరాబాద్ కు వస్తే జబ్బు నయమౌతుందనేలా చేస్తామని అన్నారు.

 అభివృద్ధి సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు పోటి పడుతాయని తెలిపారు. 24వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించారని 30 వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.