జగిత్యాలలో ఈఎస్ఐ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

జగిత్యాలలో ఈఎస్ఐ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జగిత్యాలలో ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాలలో బుధవారం జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీడీ కార్మికుల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీడీ కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఉన్న పెన్షన్‌‌‌‌‌‌‌‌ రాని కార్మికులు, నాన్‌‌‌‌‌‌‌‌ పీఎఫ్‌‌‌‌‌‌‌‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీడీ కట్టపై ముద్రించిన పుర్రె గుర్తును తొలగించేందుకు కృషి చేస్తానన్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీడీ టేకేదార్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల వెంకట్, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, జువ్వాడి నర్సింగరావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నాగభూషణం, దుర్గయ్య, శంకర్, మోహన్, అశోక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.