పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రజల గుమ్మం దగ్గరకే సంక్షేమ పథకాలు

పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రజల గుమ్మం దగ్గరకే సంక్షేమ పథకాలు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో గురువారం పర్యటించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల గుమ్మం వద్దకు సంక్షేమ పథకాలను చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏడు లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. 

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, ఎంపీడీవో అశోక్, తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.