
సత్యరాజ్, వసంత్ రవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. మిలియన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను మంగళవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. సత్యరాజ్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. డైరెక్టర్ గుహన్ సరికొత్త విజన్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ‘బాహుబలి’ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్‌లో నటించా. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు’ అని చెప్పారు.
వసంత్ రవి మాట్లాడుతూ ‘కథ వినగానే సూపర్ హీరోస్ సినిమాల్లా అనిపించింది. సత్యరాజ్ గారు సూపర్ హ్యూమన్‌లా కనిపిస్తారనగానే హ్యాపీ. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఏఐ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు’ అని అన్నాడు. ‘డీసీ, మార్వెల్ తరహా సూపర్ హ్యుమన్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. కేరళలోని వాగమన్‌లో చిత్రీకరించాం. నటీనటులందరూ రిస్క్ తీసుకుని నటించారు’ అని దర్శకుడు చెప్పాడు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ తాన్యా హోప్, నటులు రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై, నిర్మాత మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.