పెండ్లి కూతురి ముస్తాబు.. ఇది ఎక్కడో తెలుసా..?

పెండ్లి కూతురి ముస్తాబు.. ఇది ఎక్కడో తెలుసా..?

రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు చైనా నుంచి పారిపోయిన ప్రాచీన తెగ ఒకటి థాయి​లాండ్​లోని ఒక పర్వతం మీదకు చేరుకుంది. దానిపేరు ఐయు మియన్. ఆ తెగవాళ్లంతా కలిసి అక్కడే ఒక ఊరు ఏర్పాటుచేసుకున్నారు. ఎప్పటికప్పుడు వేగంగా మార్పు చెందుతున్న ఈ ప్రపంచంలో ఇలాంటి ఊళ్లు ఉండడం అరుదు. అంత వావ్​ ఫ్యాక్టర్​ ఏముంది అంటే.. ఆ గ్రామంలో వందల ఏండ్లుగా ఆచరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలనే ఇప్పటికీ పాటిస్తారు అక్కడ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు ఆ ఊళ్లో జరిగే పెండ్లి వేడుకలకు  సంబంధించినవి. 

పెండ్లి కూతురిని రెడీ చేసేందుకు వాళ్ల ఇంటికి బంధువులంతా తెల్లవారుజామున వెళ్తారు. పెండ్లి గౌను మీద ఎంబ్రాయిడరీని పెండ్లి కూతురు స్వయంగా చేసుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీ పూర్తయ్యేందుకు ఏడాది కాలం పడుతుందట! పెండ్లిలో వధువుకి స్పెషల్​గా ఒక పెద్ద టోపీ పెడతారు. వారసత్వంగా వచ్చే వెండి నగలతో పెండ్లికూతుర్ని అలంకరిస్తారు. 

ఈ హడావిడినంతా థాయి​లాండ్​కి చెందిన జేకే బాయ్​ అనే ఫొటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోలను ‘ది బ్రైడ్ ఆఫ్ ఐయు మియెన్’ పేరుతో ‘యూరోపియన్ ఫొటో అవార్డ్స్ (ఇపిఎ)’కు పంపాడు. ఆ కాంపిటీషన్​లో పీపుల్ ఫొటోగ్రఫీ – కల్చర్ కేటగిరీలో అవార్డ్ దక్కింది.