వెడ్డింగ్ డే డైట్.. వధువుకు ఇది బెస్ట్

V6 Velugu Posted on Nov 26, 2021

పెండ్లి రోజున అందంగా, హుషారుగా కనిపించాలి. గెస్ట్​ల ముందు నవ్వుతూ ఉండాలి అనుకుంటారు అమ్మాయిలు. కానీ, పెండ్లి పనులు, హడావిడి కారణంగా అలసిపోతారు. పెండ్లికి ముందు రోజు నుంచి సరైన ఫుడ్ తినకపోవడమే అందుకు కారణం అంటోంది న్యూట్రిషనిస్ట్​ నియామి అగర్వాల్​.

వెడ్డింగ్​ డే నాడు ఎనర్జిటిక్​గా ఉండేందుకు నియామి చెబుతున్న డైట్​ టిప్స్​ కొన్ని...

  • ఆకలి వేసినప్పుడు  క్యాలరీలు ఎక్కువ ఉండే బిస్కెట్లు, ఫుడ్ తినొద్దు. వీటి బదులు బాదం, వాల్​నట్స్​, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. వీటిలో ఒమెగా–3–ఫ్యాటీ యాసిడ్స్​ చర్మం, వెంట్రుకలు హెల్దీగా కనిపించేలా చేస్తాయి. 
  • చాలామంది పెండ్లిరోజున సరిపోను నీళ్లు తాగరు. దాంతో ముఖమంతా డల్​గా అవుతుంది. అలాకాకుండా, నీళ్లు సరిపోను తాగితే ఫ్రెష్​గా కనిపిస్తారు.
  • పెండ్లికి ముందు రోజు డైజెషన్​ సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి తినాలి.
  • చియాసీడ్స్​ వేసిన ఒక గ్లాస్​ నీళ్లు తాగినా యాక్టివ్​గా ఉంటారు. వీటితో పాటు పెరుగు కూడా తినాలి. దాంతో ఎనర్జీని ఇచ్చే క్యాల్షియం, ప్రొటీన్లు అందుతాయి.
  •  డైట్​లో వెజిటబుల్​ జ్యూస్​ తప్పనిసరిగా ఉండాలి. క్యారెట్లు, బీట్​రూట్​, టోమాటోలతో తయారుచేసిన జ్యూస్​ తాగితే చర్మం మెరుస్తుంది. 

Tagged wedding day diet, marriage diet, bride food diet, wedding health tips

Latest Videos

Subscribe Now

More News