Weekend Tour : బోడకొండ అందాలు చూసొద్దామా.. జస్ట్ 60 కిలోమీటర్లే

Weekend Tour : బోడకొండ అందాలు చూసొద్దామా.. జస్ట్ 60 కిలోమీటర్లే

వాటర్ ఫాల్  అనగానే చాలామందికి బొగత, కుంతాల, పొచ్చెర... ఇవే పేర్లు గుర్తుకొస్తాయి. వీకెండ్ లో వీటిని చూసొద్దామంటే లాంగ్ జర్నీ చేయాలి. అంతేకాకుండా ఒక్కరోజులో అక్కడి ప్రకృతి అందాల్ని చూసి రిటర్న్ కావడం కొంచెం కష్టమే. 'వాటర్ ఫాల్  థ్రిల్లింగ్ని మిస్ అవుతున్నాం' అనుకునేవాళ్లకి బోడకొండ వాటర్ ఫాల్ పర్ఫెక్ట్ ఛాయిస్. జలపాతం అందాల్ని చూస్తూ, ప్రకృతి ఒడిలో తనివితీరా గడపొచ్చు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బోడకొండ అట్రాక్షన్ ఇది...

గతకొన్ని రోజులుగా వానలు జోరుగా పడతుండడంతో బోడకొండ పచ్చదనంతో జలకళతో ముచ్చటగొలుపుతోంది. చుట్టూరా కొండలు, పంట పొలాలు, ప్రకృతి అందాల మధ్య బోడకొండ జలపాతం ఉంది. ఇన్నాళ్లు ఊరి వాళ్లకు మాత్రమే తెలిసిన ఈ వాటర్ ఫాల్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా  మారింది. అడ్వెంచర్ ట్రిప్స్ ని   ఇష్టపడే యూత్, ట్రావెలర్స్ వల్ల ఈ ప్రాంతం గురించి అందరికీ తెలిసింది. అప్పటి నుంచి బోడకొండ ప్రతి రెయినీ సీజన్ లో  టూరిస్టుల ఫేవరెట్ ప్లేస్ అయింది. చుట్టుపక్కల ఊళ్లజనమే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా టూరిస్టులు వాటర్ ఫాల్ చూసేందుకు వెళుతుంటారు.

బర్డ్ లవర్స్ కి ఫేవరెట్

జలపాతం దగ్గర్లోనే ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదంగా ఉండే ఈ చోటు బర్డ్ లవర్స్ కు  బాగా నచ్చుతుంది. బొగత. పొచ్చర్ వంటి జలపాతాలకు బోడకొండకు ఉన్నతేడా ఏంటంటే... ఇక్కడ పదికి పైగా కొండల మీద నుంచి నీళ్లు కిందకి పడుతుంటాయి. ప్రతి ఏడాది జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో టూరిస్ట్ ల  రద్దీ కనిపిస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడికి పిక్నిక్ కు   వచ్చే వాళ్లు చాలామందే ఉంటారు. ఫుడ్ వాటర్ కొనుక్కునేందుకు చిన్నచిన్న షాప్స్ కూడా ఉన్నాయి.

ఇలా వెళ్లాలి

హైదారాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండకి నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్లాలి. మధ్యలో లోయపల్లి రోడ్డు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మంచాల మండలం నుంచి 12.4 కిలోమీటర్లు జర్నీ చేస్తే బోడకొండ చేరుకోవచ్చు.