వీకెండ్స్.. హాలీడేస్ వచ్చినా.. నో రిలీఫ్

వీకెండ్స్.. హాలీడేస్ వచ్చినా.. నో రిలీఫ్

వర్క్ ఫ్రమ్ హోం, ఆన్​లైన్​ క్లాసులతో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్​ బిజీ

తొమ్మిది నెలలుగా ఇంటికే పరిమితం

అకేషన్స్, ఫెస్టివల్స్​ను ఎంజాయ్ చేయలేక డిప్రెషన్ ఫీలింగ్

స్టూడెంట్స్ కు విసుగు తెప్పిస్తున్న ఆన్ లైన్ క్లాస్ లు

“ ఇంటి నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి ఆఫీసుకు వెళ్తే.. సాయంత్రం 6 గంటల వరకు వర్క్ బిజీలో గడిపేసేవారు. మధ్యలో టీ బ్రేక్ లు, టీమ్ తో డిస్కషన్స్, మీటింగ్స్ ఉన్నా ఒత్తిడి అనిపించకపోయేది. టెన్షన్ ఉన్నా ఆఫీస్ లోపలే వదిలేసేవారు. బిందాస్ గా బయటకొచ్చేవారు. వీకెండ్ రాగానే ఎంజాయ్ చేసేవారు. ఇలా ఐటీ ఎంప్లాయీస్  ఉండేవారు. ఇదంతా లాక్ డౌన్ కి ముందు పరిస్థితి.  ప్రస్తుతం వర్క్​ఫ్రం హోమ్​తో వీకెండ్స్, ఫెస్టివల్​ డేస్​ కూడా వచ్చి పోతున్నాయనేది కూడా మర్చిపోయామని ఐటీ ఎంప్లాయీస్​ అంటున్నారు.’’ 

హైదరాబాద్, వెలుగు:  ఇప్పుడు సీన్ రివర్స్.  కరోనా ఎఫెక్ట్ తో తో 8 నెలలుగా సిటీలో ఒకప్పటి జోష్ కనిపించడం లేదు. అన్ లాక్ మొదలైనా అన్ని ఒక్కొక్కటీగా బ్యాక్ టు నార్మల్ అవుతున్నా ఐటీ ఎంప్లాయీస్  ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నారు. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ కాకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు స్టూడెంట్స్ కు విసుగు తెప్పిస్తున్నాయి. కనీసం వీకెండ్ వచ్చిపోయిందని కూడా తెలుస్తలేదని, పండుగ రోజుల్లో జోషే ఉండడం లేదని ఐటీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు ఎప్పుడెప్పుడు పోదామా అని ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఎదురుగా చూస్తున్నారు.

అన్ని రోజులు ఒకేలా..

ఒకే చోట కూర్చుని వర్క్ చేయడం, క్లాసులు వినడం ఇబ్బందిగా ఉందని ఎంప్లాయీస్, స్టూడెంట్స్ చెప్తున్నారు. వీకెండ్స్​వస్తే రిలాక్స్ అవడానికే సరిపోతుందంటున్నారు.  ఎటు వెళ్లేందుకు కూడా వీలుకూడా ఉండడం లేదని పేర్కొంటున్నారు. పిల్లల క్లాసుల కంటే తమకే టాస్క్ ఎక్కువగా ఉంటుందని పేరెంట్స్ వాపోతున్నారు. స్టూడెంట్స్ కూడా ఆన్ లైన్ క్లాసులతో యాంగ్జైటీ, హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నట్టు చెప్తున్నారు. లాక్ డౌన్ రోజుల మాదిరిగానే

అనిపిస్తున్నాయంటున్నారు. ఇంకా తగ్గని కరోనా భయం, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల  బయటకు కూడా వెళ్లడం లేదంటున్నారు. హాలీడేస్ అంటే జాలీగా ఉండేవని, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంటే ఏది హాలీడేనో కూడా తెలియడంలేదని, రోజులు భారంగా గడుస్తున్నాయని వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఎంప్లాయీస్ చెప్తున్నారు.

ఇంట్లో సరైన స్పేస్​ లేక..

 

ఎంప్లాయీస్, స్టూడెంట్స్ స్ర్కీనింగ్ ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లయింట్స్ మీటింగ్స్, ఆఫీస్ కాన్ఫరెన్స్ లకు అటెండ్ కావడం వల్ల రాత్రుళ్లు సరిగా నిద్రపట్టక, తలనొప్పి, కంటి సంబంధింత సమస్యలు వస్తున్నాయని ఎంప్లాయీస్ చెప్తున్నారు.  ఇంట్లో సరైన స్పేస్ లేక, మీటింగ్స్, కాన్ఫరెన్స్ కాల్స్ వల్ల చాలా స్ట్రెస్​అవుతున్నామంటున్నారు. ఆఫీసులో  టీమ్ ఉంటుందని.. డౌట్ వస్తే ఈజీగా క్లారిఫై చేసుకునే చాన్స్ ఉండేదంటున్నారు. ఇప్పుడు ఏదైనా డౌట్ వస్తే అది క్లియర్ చేసుకోవడానికే టైం వేస్ట్ అవుతుందని పేర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయంటున్నారు. స్టూడెంట్స్ సైతం డిజిటల్ క్లాసుల కోసం గంటల తరబడి మొబైల్, ట్యాబ్ ల్యాప్ టాప్ స్క్రీన్ చూడడం వల్ల హెల్త్ ఇష్యూష్ వస్తున్నట్టు చెప్తున్నారు.  వీకెండ్స్​కూడా హోమ్ వర్క్ తో సరిపోతుందని, సబ్జెక్ట్ లో డౌట్స్ ఉన్నా సరిగ్గా క్లియర్ అవడం లేదని కొందరు స్టూడెంట్స్ అంటున్నారు.

ఆఫీసుకు వెళ్తేనే బెటర్

యూకే బేస్డ్ కంపెనీలో వర్క్​ చేస్తున్నా. మార్నింగ్ లాగిన్ అయితే మీటింగ్స్ ని బట్టి షెడ్యూల్ మారుతుంది. పొద్దుట్నుంచి ల్యాప్ టాప్ ముందే కూర్చోవడం,  ప్రాజెక్ట్ ఇన్ టైంలో సబ్మిట్​చేయాలనే టెన్షన్. డే అంతా స్ట్రెస్ ఫుల్ గా ఉంటుంది. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆఫీసుకు వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. టీమ్ వర్క్ ని చాలా మిస్ అవుతున్నాం. ఆఫీస్ లో కొలీగ్స్, బ్రేక్స్, వీకెండ్ పార్టీలు, కొలాబరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా షెడ్యూల్ మొత్తం చూసుకోవాల్సి వస్తోంది.– బాలాజీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, సికింద్రాబాద్.

వీకెండ్స్ కూడా వర్క్ నే..

ఆఫీసు ఉంటే సాయంత్రం దాకా గడిచిపోయేది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల టైమింగ్స్ చేంజ్​అయినయ్​. కరెక్ట్ గా లాగౌట్  టైమ్ కి హెచ్ఆర్ నుంచి క్లయింట్ మీటింగ్ 15 మినిట్స్ ఉందంటూ  కాల్ వస్తుంది. ఆ మీటింగ్ దాదాపు 2 గంటల పైనే ఉంటుంది. వీకెండ్స్​వచ్చాయని అనుకుంటే రిలాక్స్ అయ్యే చాన్స్ కూడా అప్పుడప్పడు ఉంటలేదు. పెరుగుతున్న వర్కింగ్ అవర్స్, స్ట్రెస్ భరించలేక నేను మా బాస్ కి మెయిల్ చేశాను. ఇలా కంటిన్యూస్ గా వర్క్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందిని చెప్పా. ఆఫీస్ ఉన్నప్పుడు ఇంత ప్రెజర్ ఉండేది కాదు. – వెంకీ, ప్రైవేటు ఎంప్లాయ్