ఈ వారం వార ఫలాలు

ఈ వారం వార ఫలాలు
  • 14.8.2022 నుంచి 20.8.2022 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20)
ఊహించని విధంగా కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. సోదరులు, సోదరీల ఆప్యాయత, ఆదరణ పొందుతారు. వ్యాపారులు అనుకోని విధంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు.

వృషభం ( ఏప్రిల్ 21  – మే 21)
ఇంతకాలం పడిన కష్టాలు, ఇబ్బందులు క్రమేపీ తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. బంధుమిత్రుల ఆదరణ, ప్రేమ పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వివాహయత్నాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా దక్కుతాయి. ఉద్యోగులకు సహచరుల తోడ్పాటు లభిస్తుంది. అపవాదుల నుంచి బయటపడతారు.

మిథునం (మే 22 – జూన్ 22)

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయానికి లోటు రాదు. రుణదాతల ఒత్తిడులు తగ్గుతాయి. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి స్నేహితులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు.

కర్కాటకం (జూన్ 23 – జులై 23)

ముఖ్య కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు తరచూ మార్చుకుంటారు. అందరిలోనూ గుర్తింపు కోసం యత్నించినా ఫలించదు. ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి. బంధువులు, స్నేహితులతో స్వల్ప వివాదాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. వారాంతంలో శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం.

సింహం (జులై 24 – ఆగస్టు 22)
నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. ఆత్మీయులు, బంధువులు మీపై ప్రేమ చూపుతారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆదాయం ఆశాజనకం. అయితే అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. మీ నిర్ణయాలు అందర్నీ ఆలోచింపచేస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలమై ఊరట చెందుతారు. వ్యాపారులకు మరింత సానుకూలం. ఉద్యోగులు క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు.

కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు, లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు.

వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 22)
 వ్యయప్రయాసలు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు. శ్రమించే తత్వం, పట్టుదల విజయాల వైపు నడిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు సైతం తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఎదురైన  ఇబ్బందులు తొలగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా గడుపుతారు.

ధనుస్సు (నవంబర్ 23 – డిసెంబర్ 22)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలను అంతా సమర్థిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు.

మకరం (డిసెంబర్ 23 – జనవరి 22)
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహన, కుటుంబసౌఖ్యం. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రాగలదు.

కుంభం (జనవరి 23 – ఫిబ్రవరి 22)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మీ ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. మీపై వచ్చిన విమర్శలు తొలగి ఊరట చెందుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి.

మీనం (ఫిబ్రవరి 23 – మార్చి 20)
అన్నింటా విజయాలే. ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ కృషి ఫలిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు.