వార ఫలాలు : 27.08.2023 నుంచి 02.09.2023 వరకు

వార ఫలాలు :  27.08.2023 నుంచి 02.09.2023 వరకు

మేషం 

అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. సమాజంలో  గౌరవం. ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి పెరుగుతుంది. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టుల యత్నాలు సఫలమవుతాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. వ్యాపారాల్లో ముందడుగు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం. కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలు, కళాకారులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు.

వృషభం

రాబడి సంతృప్తినిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ఏర్పాట్లు. సేవలకు గుర్తింపు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాల్లో  లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మిధునం 

ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా  మారతారు. అన్ని కార్యక్రమాల్లో విజయం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. మీ నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరం. కళాకారులు, పరిశోధకులకు అనుకూల సమయం.

కర్కాటకం 

కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు నిదానిస్తాయి. ఇంతకాలం పడిన కష్టానికి కొంత ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వ్యాపారాల విస్తరణలో అడుగు ముందుకు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.  పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల శ్రమ ఫలిస్తుంది.

సింహం

ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారమే అన్నట్లుంటుంది. కార్యసాధన, దీక్షాదక్షతలతో కార్యరంగంలోకి దిగి విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, క్రీడాకారులకు కాస్త ఊరట.

కన్య

అనుకున్న కార్యాలు విజయవంతం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.  వ్యాపారాల్లో పెట్టుబడులు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవర్గాలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు. కళాకారులకు నిరాశ తొలగుతుంది.

తుల

ఆదాయం సంతృప్తినిస్తుంది. వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో కదలికలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారడం విశేషం. ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం కొంత తగ్గే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు.

వృశ్చికం 

ఎంతటి వారినైనా ఆకట్టుకునేందుకు యత్నించి సఫలమవుతారు. జీవితంలో మరపురాని సంఘటన ఎదురవుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకమే. వ్యాపారాల్లో పురోగతి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొత్త అవకాశాలు.

ధనస్సు 

రాబడి ఆశాజనకం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ అంచనాలు నిజం కాగలవు. కార్యసాధన దిశగా ముందుకు సాగుతారు.సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులకు కాస్త ఊరట లభిస్తుంది. పారిశ్రామిక,  రాజకీయవేత్తలకు అంచనాలు కొన్ని నిజమవుతాయి.

మకరం

కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశయాలు నెరవేరతాయి. కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. ఆలోచనలకు కార్యరూపం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనే యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పెట్టుబడులు కాస్త ఆలస్యం. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.  ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు క్రమేపీ అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

మీనం

ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఒక కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొంతవరకూ అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతర ఫలితం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400