వారఫలాలు : 2023 జూన్ 04 నుంచి జూన్ 10 వరకు

వారఫలాలు : 2023 జూన్ 04 నుంచి జూన్ 10 వరకు

మేషం ; ఆర్థికంగా మరింత బలపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపిస్తారు. వాహనాలు, నగలు కొంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. వారాంతంలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు.

సింహం ; ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. శుభవార్త వింటారు. సమస్యలు పరిష్కారం. శుభకార్యాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం.

ధనుస్సు ; కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజ సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అభివృద్ధికి  కుటుంబసభ్యుల తోడ్పాటు. ఆశించిన కాంట్రాక్టులు చేపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు నష్టాల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.

వృషభం ; అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు తోడుగా నిలుస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. కుటుంబంలో సంతోషం. సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి. శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు.

కన్య ; సన్నిహితులతో విభేదాలు పరిష్కారం. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. స్నేహితులను కలుస్తారు. కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  వ్యాపార విస్తరణలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. ఖర్చులు అధికం. స్వల్ప రుగ్మతలు.  

మకరం ; నూతన ఉద్యోగావకాశాలు. ప్రతి ప్రయత్నానికి బంధువులు సహకరిస్తారు. ఇంటాబయటా ఒడిదుడుకులు తొలగుతాయి. వాహనాలు, నగలు కొంటారు. భూవివాదాల నుంచి విముక్తి. స్వల్ప అనారోగ్యం. రాబడికి ఇబ్బంది లేదు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ధనవ్యయం. 

మిధునం ; కార్యక్రమాలలో విజయం. సమాజంలో గౌరవప్రతిష్టలు పొందుతారు. కుటుంబసభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఆదాయం ఆశాజనకం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యాపారాలు చేపట్టి లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృథా ఖర్చులు. సోదరులతో వివాదాలు.

 తుల ; అదనపు ఆదాయంతో ఉత్సాహం రెట్టింపు. శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్త. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు.

కుంభం ; అవసరాలకు సకాలంలో సొమ్ము అందుతుంది. సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు భవిష్యత్‌‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి. సమాజ సేవాకార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. ఖర్చులు. మానసిక అశాంతి. 

కర్కాటకం ; కొన్ని కార్యాలలో ఆటంకాలు. బంధువుల ద్వారా కొన్ని సమస్యలు. వివాదాలకు కొంత దూరంగా ఉండండి. శారీరక సంబంధిత రుగ్మతలు. కుటుంబంలోనూ, బయటా మీకు వ్యతిరేకులు  పెరుగుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు లేక నిరాశ పడతారు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులు, సాంకేతిక నిపుణులు ఒత్తిడులు ఎదుర్కొంటారు.  వారాంతంలో బంధువులతో సఖ్యత. ధన, వస్తులాభాలు.

వృశ్చికం ; ముఖ్యమైన కార్యాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఇబ్బందులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో విభేదాలు పరిష్కారం. అనుకోని విధంగా కాంట్రాక్టులు పొందుతారు. రాబడి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో శారీరక రుగ్మతలు. బంధువులతో విభేదాలు.

మీనం ; నూతన వ్యక్తులు పరిచయం. విద్యార్థులు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థలాలు, వాహనాలు కొంటారు. అవసరాలు తీరతాయి.ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు.

వక్కంతం చంద్రమౌళి
జోతిష్య పండితులు
ఫోన్ : 9885299400