వార ఫలాలు.. 2023 నవంబర్ 19 నుంచి 25 వరకు

వార ఫలాలు..  2023 నవంబర్ 19 నుంచి 25 వరకు

మేషం

మీకష్టం ఫలిస్తుంది. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సాయపడతారు. రాబడికి లోటు ఉండదు. వేడుకలకు ఖర్చు చేస్తారు. ఉద్యోగాన్వేషణలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. క్రీడాకారులు సత్తా చాటుకుని విజయాలు సాధిస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నతస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలమవుతాయి.

వృషభం 

కొన్ని కార్యక్రమాలలో విజయం.  అదనపు రాబడి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు.  ప్రముఖుల పరిచయం. విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలం. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలకి కార్యరూపం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అడ్డంకులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు లక్ష్యసాధనలో ముందడుగు.

మిథునం

బంధుమిత్రుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. విద్యావకాశాలు తృటిలో చేజారవచ్చు. ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చుల వల్ల అప్పులు చేస్తారు. కొన్ని విషయాలలో రాజీమార్గం తప్పనిసరి. వాహనాలు నడిపే వారు అప్రమత్తత పాటించాలి. వ్యాపారులు అందిన లాభాలతో సరిపెట్టుకోవడం మంచిది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పుతాయి. శుభ వర్తమానాలు. వారారంభంలోఆకస్మిక ధనలబ్ధి.

కర్కాటకం

ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదిస్తారు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. కుటుంబ బాధ్యతలపై అధిక దృష్టి సారిస్తారు. మీ మనసులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. రావలసిన డబ్బు అందడంలో జాప్యం. వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టసాధ్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవేత్తల, కళాకారుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వారాంతంలో విందులు,  వినోదాలు. వాహనసౌఖ్యం. కొత్త పరిచయాలు.

సింహం

తండ్రి తరఫు వారి నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలులో ముందడుగు. సమస్యల నుంచి విముక్తి. క్రీడాకారులకు అవకాశాలు లభించవచ్చు. గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారులకు లాభాల అన్వేషణలో కొంత విజయం. ఉద్యోగులకు అదనపు విధుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అరుదైన ఆహ్వానాలు.

కన్య

మీ అంచనాలకు తగిన రాబడి. ఆత్మీయులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో హామీలు మంచిది కాదు. ఆస్తుల వివాదాలు పెరిగే అవకాశం. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి. ఇంటి నిర్మాణాల్లో జాప్యం. వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. క్రీడాకారులు ఎటూతేల్చుకోని స్థితిలో పడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మానసిక సంఘర్షణ. వారారంభంలో ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. సత్కారాలు.

తుల

తండ్రి తరఫు వారి నుంచి ఒత్తిళ్లు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగాన్వేషణలో ప్రతిబంధకాలు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకం. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. వారాంతంలో శుభవర్తమానాలు. ధనప్రాప్తి. విందు వినోదాలు.

వృచ్చికం

మీ వ్యూహాలు, అంచనాలు నిజం చేసుకుంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగయత్నాలలో అనుకూల పరిస్థితులు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి.

ధనస్సు

చాకచక్యంతో సమస్యలు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులకు మార్గం సుగమం. ఉద్యోగబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు అవార్డులు దక్కుతాయి.

మకరం

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. తండ్రి తరఫు వారితో విభేదాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వాహన సౌఖ్యం. వ్యాపారులు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.

కుంభం

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. తండ్రి తరఫు వారితో విభేదాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వాహన సౌఖ్యం. వ్యాపారులు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.

మీనం

పట్టుదల, ఆత్మవిశ్వాసంతో  కార్యక్రమాలు పూర్తి. ఆదాయం మెరుగుపడే అవకాశం. అయితే ఖర్చులు అదుపు చేసుకోవాలి. విద్యావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాల పరిష్కారం. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సాంకేతిక రంగాల వారికి మరింత సానుకూలం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులు ఎంతటి పనిభారమైనా అవలీలగా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.