వార ఫలాలు ( సౌరమానం) : 03 .12.2023 నుంచి 09.12.2023

వార ఫలాలు (  సౌరమానం) :  03 .12.2023 నుంచి 09.12.2023

మేషం : కొన్ని వ్యవహారాలలో మీదే పైచేయి. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. బాకీలు కొన్ని అందుతాయి. రుణాలు తీరతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి పిలుపు రావచ్చు. కళాకారులు, రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి.

వృషభం : ముఖ్యమైన కార్యాలు విజయవంతం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి.  రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో మీ మాటే చెల్లుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. యుక్తితో కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

మిథునం : కార్యక్రమాలలో ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి.  బంధువులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. రాబడి తగ్గి అప్పులు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం.  వ్యాపారులకు లాభాలు స్వల్పం. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం. కళాకారులు, క్రీడాకారులకు సమస్యలు. వారాంతంలో ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం.

కర్కాటకం : ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి. రాబడి సంతృప్తికరం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రచన, సాహిత్యాలపై ఆసక్తి. కుటుంబసభ్యుల సహకారంతో  వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త ఆశలు. మీ తెలివితేటలకు పదునుపెట్టి సత్తా చాటుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు కార్యసిద్ధి. 

సింహం : కార్యక్రమాలలో విజయం. విలువైన వస్తువులు, స్థలాలు కొంటారు. శత్రువులను ఆకట్టుకుంటారు. ఇచ్చిన హామీల అమలుకు శ్రమిస్తారు. కొన్ని వివాదాలు ఎవరి ప్రమేయం లేకుండానే పరిష్కారం. వాహనసౌఖ్యం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆశించిన ఆదాయం. దీర్ఘకాలిక  రుణబాధల నుంచి విముక్తి. వ్యాపారులకు భాగస్వాముల నుంచి సహకారం.  ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. 

కన్య : యత్నకార్యసిద్ధి, స్నేహితులు చేదోడుగా నిలుస్తారు. కష్టం ఫలిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. రాబడికి లోటు రాకుండా ఖర్చులు చేస్తారు. కోర్టు వ్యవహారం సానుకూలమయ్యే సూచన.  కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు. వ్యాపారులకు కొత్త వ్యాపారాల ఏర్పాటులో విజయం. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు  వివాదాల పరిష్కారం.

తుల : ప్రతి వ్యవహారంలోనూ నిదానం ముఖ్యం. భూసంబంధిత వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. విచిత్రమైన సంఘటనలు.  వాహనాలు కొనే యత్నాలు  వాయిదా వేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోవాలి. ఆదాయం కంటే ఖర్చులు అధికం. వ్యాపారులకు సామాన్యం. రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు శ్రమకోర్చాల్సిన సమయం. పరిశోధకులు, శాస్త్రవేత్తలకు అంచనాలు తప్పుతాయి. వారాంతంలో శుభవర్తమానాలు. ధనలబ్ధి.

వృశ్చికం : ఏ  కార్యం  చేపట్టినా విజయమే. ఆప్తులు మరింత దగ్గరవుతారు. చిత్రమైన సంఘటనలు. శుభకార్యాలకు సమాయత్తం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనల అమలు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం.

ధనుస్సు : కార్యక్రమాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వాహనాలు, ఆభరణాలు భద్రంగా చూసుకోండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆదాయం తగ్గి అప్పులు కోసం యత్నిస్తారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. సోదరులు, స్నేహితులతో స్వల్ప విభేదాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు  నిరుత్సాహం.

మకరం : మీ కృషి ఫలిస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. ప్రత్యర్థులు స్నేహితులుగా  మారతారు. ఆలోచనలకు కార్యరూపం. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం ఆశాజనకం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చ. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి. వైద్యులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

కుంభం : కొంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యలు తీరతాయి. అనుకూల వాతావరణం. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. ఆత్మీయులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. అరుదైన ఆహ్వానాలు. ఆదాయం అనుకున్న మేర సమకూరి అవసరాలు తీరతాయి.  భూములు, వాహనాలు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. కళాకారులు, క్రీడాకారులకు ఉపశమనం.

మీనం : అతిథుల ద్వారా ముఖ్య సమాచారం. ప్రత్యర్థులతో కొంత సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. రావలసిన డబ్బు ఆలస్యంగా అంది రుణయత్నాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారులు పెట్టుబడుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కళాకారులకు అవకాశాలు నిరాశపరుస్తాయి. క్రీడాకారులు, వ్యవసాయదారులకు కాస్త ఊరట. వారారంభంలో చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. 

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు ఫోన్​: 98852 99400