వారఫలాలు : 2023 సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు

వారఫలాలు : 2023 సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు

మేషం 

మీ కృషి ఫలించే సమయం. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. వివాహ, ఉద్యోగయత్నాల్లో ముందడుగు వేస్తారు. సమయానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయం. కుటుంబసమస్యలు చాకచక్యంగా పరిష్కారం. కుటుంబసభ్యులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పరిశోధకులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

వృషభం 

అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. రాబడి అవసరాలకు సరిపడక అప్పులు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణాల్లో  అవాంతరాలు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల్లో  తొందరవద్దు. ఉద్యోగులు విధి  నిర్వహణలో స్వల్ప ఆటంకాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సామాన్యస్థితి. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం.

మిథునం

వాహనాలు, స్థలాలు కొంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగాల్లో మార్పులు అనివార్యం కావచ్చు. కళాకారులకు  కొత్త అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

కర్కాటకం

సింహం

కొన్ని కార్యక్రమాలు వాయిదా. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి.  కుటుంబంలో మీపై ఒత్తిడులు పెరుగుతాయి. వాహనాలు నడిపేటపుడు అప్రమత్తంగా ఉండాలి.  వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పకపోవచ్చు. పరిశోధకులు, క్రీడాకారులకు కొంత నిరాశ. వారాంతంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి.

కన్య

అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. బాధ్యతలు సవాలుగా మారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూవివాదాలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము స్వల్పంగా అంది అవసరాలకు ఇబ్బందిపడతారు. ఇళ్ల నిర్మాణయత్నాలలో ఆటంకాలు. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు మరింత పనిభారం. రాజకీయవేత్తలు, కళాకారులకు వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో ధనలబ్ధి. వాహనయోగం.

తుల

వృశ్చికం

కొత్త కార్యాలకు  శ్రీకారం. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యూహాల అమలులో ముందడుగు. విద్యార్థులకు ప్రోత్సాహకరం. రావలసిన  బాకీలు వసూలవుతాయి. రుణాలు తీరే సమయం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు అనుకున్న పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు.

ధనస్సు 

ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆదాయం పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు, ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విజయాలు. క్రీడాకారులు, వైద్యులు ప్రతిభ కనబరుస్తారు.

మకరం

ముఖ్యమైన కార్యాలు విజయవంతం. కుటుంబంలో సమస్యల పరిష్కారం. భూలాభాలు. ఎంతటివారినైనా మాటలతో  ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. రాబడి మెరుగుపడుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరి ఊరట. కళాకారులు, పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం

కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. విచిత్రమైన సంఘటనలు. కుటుంబంలో  ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని  విషయాలలో వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు కొంత గందరగోళం. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. పెట్టుబడులలో జాప్యం. ఉద్యోగులకు మార్పులు అనివార్యం కావచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు చికాకులు. పరిశోధకులకు నూతన అవకాశాలు దక్కుతాయి.

మీనం 

కొన్ని కార్యాలు  నిరాశాజనకంగా సాగుతాయి. ఆదాయం కొంత మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు ఫోన్​: 98852 99400