
న్యూఢిల్లీ: డెన్మార్క్ ఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నార్డిస్క్ భారతదేశంలో ఊబకాయం నిరోధక డ్రగ్ వెగోవీని మంగళవారం విడుదల చేసింది. దీర్ఘకాలిక బరువు నియంత్రణకు, ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారిలో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది. ఇందులో సెమాగ్లుటైడ్ అనే యాక్టివ్ ఇంగ్రీడియెంట్ఉంటుంది.
ఇది వారానికి ఒకసారి తీసుకోవాల్సిన ఇంజెక్షన్ రూపంలో, సులభంగా ఉపయోగించగల పెన్ డివైజ్‌లో లభిస్తుంది. 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ, 1.7 ఎంజీ 2.4 ఎంజీ డోసుల్లో వస్తుంది. వెగోవీ నెల డోసు ధర రూ. 17,345 నుంచి రూ. 26,050 వరకు ఉంటుంది. ఇది ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభించే మందు అని కంపెనీ తెలిపింది.