
ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్ములు, ఎక్సర్ సైజ్ లు, ఆపరేషన్ లు, అన్నం తినకుండా కడుపు మాడ్చుకోవడం, ఫాస్టింగ్ చేయడం, ట్రీట్మెంట్ అంటూ పడరానికి పాట్లు పడుతుంటారు. కానీ బరువు తగ్గేందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర, మితమైన ఆహారం తో పాటు ఇంట్లోనే రోజూ ఉదయం బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. అలా చేస్తే 10రోజుల్లో, నెలరోజుల్లో బరువుతగ్గుతారా అనే డౌట్ రావొచ్చు. ఖచ్చితంగా బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుంది.
అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటూ వ్యాయామంలో కొన్ని రకాలైన వర్కౌట్లు చేయాలి. ఈ వర్కౌట్లలో నాలుగు రకాల పద్దతులున్నాయి. వాటిని యాక్టివేషన్, సూపర్‌సెట్, సర్క్యూట్ మరియు బర్న్‌అవుట్ అంటారు. ప్రతీ పద్దతిని ముప్పై సెకన్లపాటు చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇల్లు, ఆఫీస్, జర్నీ ఇలా రకరకాల కారణాల వల్ల ఊబకాయంతో బాధపడే మహిళలు వ్యాయామం చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ నాలుగు పద్దతుల్లో ఉన్న వ్యాయామాల్ని తప్పని సరిగా చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు, మన శరీరం ఆకారాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవచ్చు.
గమనిక : ఊబకాయంతో ఆనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎట్టిపరిస్థితుల్లో పైన చెప్పిన నాలుగు పద్దతులే కాదు. ఎలాంటి వ్యాయామాలు, యోగాలంటి వాటి జోలికి వెళ్లకపోవడం చాలా మంచింది. అయినా వ్యాయాయం, యోగా చేయాలనిపిస్తే తప్పని సరిగా నిపుణులైన డాక్టర్ల సలహాతో చేసుకోవచ్చు.