చీజ్‌‌తో బరువు తగ్గొచ్చు

చీజ్‌‌తో బరువు తగ్గొచ్చు

 పిజ్జా, బర్గర్‌‌‌‌లలోనే కాకుండా రకరకాల ఫుడ్‌‌ ఐటమ్స్‌‌లో చీజ్‌‌ వేసుకొని తింటున్నారు. చీజ్‌‌ను ఎలా తిన్నా దాని ద్వారా వచ్చే ప్రొటీన్స్‌‌, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్‌‌ మాత్రం ఎక్కడికీపోవు.  మార్కెట్‌‌లో ఫెటా, పర్మేసన్‌‌, మోజరెల్లా అని చాలా రకాల చీజ్‌‌లు ఉన్నాయి. చీజ్‌‌లో ఉన్న న్యూట్రియెంట్స్‌‌ వల్ల బ్లడ్ ప్రెజర్‌‌‌‌ తగ్గుతుంది. కండరాలు ధృడంగా అయ్యేందుకు హెల్ప్‌‌ అవుతుంది. ఎముకల పెరుగుదలకు సాయ పడుతుంది. టైప్‌‌ 2 డయాబెటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. రోజు 40 గ్రా. చీజ్‌‌ తినడం వల్ల గుండెకు ఆరోగ్యం, శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌  అంటున్నారు.ఇలానే కాకుండా చీజ్‌‌ను చాలా ఫుడ్‌‌ ఐటమ్స్‌‌లో వాడొచ్చు. 
సలాడ్స్ ఇష్టపడని వాళ్లకు చీజ్ మంచి ఆల్టర్నేట్‌‌. ఫెటా చీజ్‌‌ను ఎక్కువగా సలాడ్‌‌లను తయారు చేయడానికి వాడతారు. చీజ్‌‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సలాడ్‌‌లో కలిపితింటే టేస్ట్‌‌ బాగుంటుంది.
బ్రేక్‌‌ఫాస్ట్‌‌ను హెల్దీగా చేయడానికి చీజ్‌‌హెల్ప్‌‌ చేస్తుంది​. ఆమ్లెట్‌‌ లేదా ఏ బ్రేక్‌‌ఫాస్ట్‌‌లో అయినా చీజ్‌‌ను కలుపుకొని తినొచ్చు. ఇది బ్రేక్‌‌ఫాస్ట్‌‌ను టేస్టీగా చేయడమే కాకుండా న్యూట్రియెంట్స్‌‌ను ఇస్తుంది. అలాగే తక్కువ ఫ్యాట్‌‌ ఉన్న కుకింగ్‌‌ ఆయిల్‌‌ను వంటల్లో వాడటం బెటర్‌‌‌‌. 
మంచి న్యూట్రిషనల్‌‌ ఫుడ్‌‌ తింటూ బరువు తగ్గాలి అనుకునే వాళ్లు చీజ్‌‌ను ఉడకబెట్టిన కూరగాయల్లో వేసి హ్యాపీగా తినొచ్చు. బ్రొకొలి, వంకాయ వంటి వాటిల్లోకి చీజ్‌‌ను కలిపి తినేయొచ్చు.
మాంసం తినని వాళ్లకు చీజ్ మంచి ఆల్టర్నేట్. అంటే రెండింట్లో ఒకే రకమైన ప్రొటీన్స్‌‌ ఉన్నా, చీజ్‌‌లో మాత్రం గుడ్‌‌ ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్‌‌ వల్ల గుండెకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. 
ఫ్రూట్స్‌‌లో  చీజ్‌‌ కలుపుకొని స్నాక్స్‌‌లాగా కూడా తినొచ్చు. పుచ్చకాయతో ఫెటా చీజ్, రాస్‌‌బెర్రీతో క్రీమ్‌‌ చీజ్, మామిడి పండు, యాపిల్‌‌లో కూడా చీజ్‌‌ను కలిపి తినొచ్చు.