పానీపూరితో వెయిట్​లాస్​ నిజమే.. కానీ

పానీపూరితో వెయిట్​లాస్​ నిజమే.. కానీ

‘పానీపూరి అని ఉంటుంది ఒక పదార్థం... అందులో పానీ పరమ పవిత్రం’ అని ఏ టైంలో అన్నారో కాని అది నిజమేనట. అవును పానీపూరి నీళ్ల వల్ల వెయిట్‌‌లాస్‌‌ అయ్యే ఛాన్స్‌‌ ఉందంటున్నారు. 
  పానీపూరి వాటర్‌‌‌‌లో పుదీనా, చింతపండు, జీలకర్ర​ వాడతారు. ఇవి ఆ వాటర్‌‌‌‌ను రుచిగా తయారుచేస్తాయి. మామూలుగానే పుదీనా నీళ్లతో బరువు తగ్గొచ్చు. హెల్త్‌‌ కూడా మెరుగుపడుతుంది. అంతేకాక ఇరిటబుల్‌‌ బోవెల్‌‌ సిండ్రోమ్‌‌ అంటే పెద్ద పేగులో వచ్చే సాధారణ కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్‌‌ ట్రబుల్‌‌, అజీర్తి, మలబద్ధకం వంటి వాటిని పోగొడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ నీళ్లలో ఫైబర్‌‌‌‌, విటమిన్‌‌– ఎ, ఐరన్‌‌, మాంగనీస్‌‌, ఫోలేట్‌‌( విటమిన్‌‌  బి9) ఉంటాయి. 
 ఇదంతా ఓకే కానీ, తినడానికి రుచిగా ఉన్నా పానీపూరి, దాంట్లో వాడే కర్రీతో ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు మరి.