రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి..పీఎంఎఫ్ఎంఈ రుణాల మంజూరులో వేగం పెంచాలి

రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి..పీఎంఎఫ్ఎంఈ రుణాల మంజూరులో వేగం పెంచాలి
  •     గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు:  గద్వాల జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు ఈ నెల 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఎఫ్​ఎంఈ రుణాల మంజూరులో వేగం పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతతో పాటు బ్యాంకింగ్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లు, ఏటీఎంల సంఖ్యను పెంచాలని సూచించారు.

అనంతరం వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తూ, 2025-–26 యాసంగి సీజన్ కోసం జిల్లాలో 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.