హైదరాబాద్, వెలుగు: నేషనల్ అవార్డ్ ఫర్ మానుఫాక్చరింగ్ ఎక్సలెన్స్ 2023-–24’ అవార్డును దక్కించుకున్నామని వెల్‌స్పన్ తెలిపింది. మానుఫాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ సిల్వర్ విభాగంలో అవార్డు పొందామని ప్రకటించింది. తయారీ రంగంలో అత్యుత్తమ సేవలను అందించిన సంస్థలకు ఈ అవార్డు ఇస్తారని తెలిపింది.
కాస్ట్ ఆప్టిమైజేషన్, డక్ట్ ఫోలియో మెరుగుదల, లీడ్ టైమ్ మేనేజ్‌మెంట్, ప్రతిభను ప్రోత్సహించడం వంటి విభాగాల్లో వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ అత్యుత్తమ ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని వెల్స్పన్పేర్కొంది. ఇది హోం టెక్స్‌టైల్స్ తయారు చేస్తుంది.