కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలి

కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలి

పశ్చిమబెంగాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ఇవాళ బడి బాట పట్టారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఎంతో హుషారుగా స్కూల్స్ కు వెళ్లారు. అయితే ప్రతి పాఠశాలలో కోవిడ్ రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఈనెల 28 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అత్యసవర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. బహిరంగ సభలపై నిషేధం విధించారు. 

మరిన్ని వార్తల కోసం

 

ఇంజనీరింగ్​ డిగ్రీ ఉంటే చాలు..టీఎస్ లో మస్తు ఉద్యోగాలు

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి మృతి