
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో గురువారం మొదలైన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌కు శుభారంభం లభించింది. జోషువా డ సిల్వ (79), కావెమ్ హోడ్జ్ (71) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 266/8 స్కోరు చేసింది. సింక్లెర్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ నెగ్గిన విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (4), చందర్‌పాల్ (21), మెకంజీ (21), అలిక్ అథనాజె (8) నిరాశపర్చారు. 64 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన దశలో సిల్వ, హోడ్జ్ ఆరో వికెట్‌కు 149 రన్స్ జోడించి ఆదుకున్నారు. 4 వికెట్లు తీసిన స్టార్క్ టెస్ట్‌ల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.