శ్రీలంకతో మూడు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో విండీస్‌‌‌‌ శుభారంభం

 శ్రీలంకతో మూడు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో విండీస్‌‌‌‌ శుభారంభం

కింగ్‌‌‌‌స్టన్‌‌‌‌: శ్రీలంకతో మూడు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌‌‌‌లో షై హోప్‌‌‌‌ (65 నాటౌట్‌‌‌‌), బౌలింగ్‌‌‌‌లో జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ (3/18), షామర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌ (3/29) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ 7 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ నెగ్గిన లంక 20 ఓవర్లలో 147/9 స్కోరు చేసింది. 

కమింద్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (51), కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (36), డాసున్‌‌‌‌ షనక (22) మెరుగ్గా ఆడారు. తర్వాత విండీస్‌‌‌‌ 19.2 ఓవర్లలో 149/3 స్కోరు చేసి గెలిచింది. బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (37)తో తొలి వికెట్‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌ జత చేసిన హోప్‌‌‌‌.. హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (17)తో రెండో వికెట్‌‌‌‌కు 28, రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ (16)తో మూడో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జోడించి గెలిపించాడు. వానిందు హసరంగ 2 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.