ద్రోణి ఎఫెక్ట్: మార్చి 16 నుంచి వర్షాలు

ద్రోణి ఎఫెక్ట్:  మార్చి 16 నుంచి వర్షాలు

రాష్ట్రంలో   ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఈ నెల 16 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. చత్తీస్ ఘడ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించడంతో  రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. ఈ నెల 20 వరకు రాష్ట్రంలో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

రాష్ట్రంలో నిన్న కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్ లో32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సాధారణం కటే ఇది 2.6 డిగ్రీలు తక్కువ