కరోనా సోకని దేశాలేవో తెలుసా?

కరోనా సోకని దేశాలేవో తెలుసా?

ఇప్పటికీ కరోనా సోకని దేశాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, అది నిజం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. అందులో 6 లక్షల పైచిలుకు కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. దాదాపు 48వేల మంది మరణించారు. దీన్ని బట్టి చూస్తే కరోనా దాదాపు ప్రపంచంలోని దేశాలన్నింటికి చుట్టుముట్టిందని అర్థమవుతుంది. అయితే తొమ్మిది దేశాలను మాత్రం ఇంకా చేరలేదు.

మార్చి 30, 2020 నాటికి జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన గ్లోబల్ ట్రాకింగ్ ప్రకారం కరోనా వైరస్ సోకని తొమ్మిది దేశాలను గుర్తించింది. అవేంటో చూద్దామా మరి..

మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్తాన్ పురావస్తు శిధిలాలకు పేరుగాంచింది. సహజ వాయువు నిల్వలలో ఇది ప్రపంచంలోనే 4వ దేశం. ఇక్కడ కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదుకాలేదు. అందుకే దాని గురించిన సమాచారం కూడా అవసరంలేదనట్టుగా ‘కరోనావైరస్’ అనే పదాన్ని బ్యాన్ చేసింది.

మధ్య ఆసియాలోని మరో దేశం తజికిస్తాన్. కఠినమైన పర్వతాలకు ప్రసిద్ది చెందిన ఈ దేశం హైకింగ్ మరియు క్లైంబింగ్‌కు ప్రసిద్ది చెందింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి మొదటి వారంలో 35 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. 2019 లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9.32 మిలియన్లు.

తూర్పు ఆసియాలోని ఉత్తర కొరియా. ఈ దేశ అధ్యక్షడు జిన్ పింగ్. అత్యంత రహస్యంగా కార్యక్రమాలు చక్కబెట్టే దేశాలలో ఇది ఒకటి. చైనాతో సరిహద్దులను మూసివేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని త్వరగా అడ్డుకోగలిగింది. 2020 లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా 25.8 మిలియన్లు.

ఉత్తర ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్. గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన దేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుత జనాభా సుమారు 11.1 మిలియన్లు.

మిడిల్ ఈస్ట్ లోని మరో దేశం యెమెన్. అరబ్ ల చేత పాలించబడుతున్న రెండో అతిపెద్ద సార్వభౌమ రాజ్యం. ఈ దేశంలో ఆకలి చావులు ఎక్కువ. ఇక్కడి జనాభా సుమారు 30 మిలియన్లకు దగ్గరగా ఉంది.

తూర్పు ఆఫ్రికాలోని బురుండి. ఈ దేశం వన్యప్రాణులకు మరియు పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.

తూర్పు ఆఫ్రికాలోని మరో దేశం మాలావి. ఇక్కడి మలావి సరస్సు గ్రేట్ రిఫ్ట్ వ్యాలీగా పిలవబడుతుంది. ఈ దేశం వన్యప్రాణులకు మరియు బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.

దక్షిణ ఆఫ్రికాలోని లెసోతో. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. సెహ్లబాతేబే నేషనల్ పార్క్ చాలా ప్రసిద్ధి చెందింది.

తూర్పు ఆఫ్రికాలోని కొమొరోస్. ఇక్కడ ద్వీప సమూహాలు ఎక్కువగా ఉంటాయి. కొమోరియన్ ద్వీప సమూహంలో సువాసన గల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని సుగంధ ద్వీపాలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా కరోనా కేసు నమోదు కాలేదు.

For More News..

కరోనాతో ఆరు వారాల శిశువు మృతి

ఏప్రిల్ 14 వరకు ఫ్రీగా పాలు, కూరగాయలు

3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

కరోనా ఎఫెక్ట్: పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే ఇవి ఉండాల్సిందే

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..