మాకున్నది 8.30 ఎకరాలే..70 ఎకరాలతో సంబంధం లేదు

మాకున్నది 8.30 ఎకరాలే..70 ఎకరాలతో సంబంధం లేదు

జమున హేచరీస్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కలెక్టర్ కు ఏం అధికారముందన్నారు ఈటల జమున.ఈ భూములకు సంబంధించిన సర్వే కాపీలను  కోర్టుకు అప్పజెపాలన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు.  కానీ ఇవాళ భూములు ఆక్రమించారంటూ కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారని.. కలెక్టర్ ఏమైనా టీఆర్ఎస్ నాయకుడా? అని ప్రశ్నించారు. రేపు కలెక్టర్ మీద కేసు పెడతాం.. ధరణిలో నమోదు అయిన భూములనే తాము కొన్నామన్నారు.  రామారావు అనే వ్యక్తి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. ధరణిలో నమోదు  అయినా భూములన్నీ ఫెకా....లేక తమ భూములు మాత్రమేనా అని ప్రశ్నించారు.

సర్వే నెంబర్ 81 లో 5 ఎకరాల 30 గుంటలు,130లో 3 ఎకరాలు ఉందని.. ఈ రెండు సర్వే నెంబర్ లో కలిసి తమకు 8 ఎకరాల 30 గుంటలు ఉందన్నారు. కలెక్టర్ చెప్పిన  70 ఎకరాలతో తమకు సంబంధం లేదన్నారు.  2018లో భూములు కొన్నామని...దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ ఉందన్నారు.  అన్ని పర్మిషన్స్ తీసుకునే షెడ్డు నిర్మాణం చేశామన్నారు. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమి....ఇప్పుడు ప్రైవేట్ భూములు అని చూపిస్తోందన్నారు.  పౌల్ట్రీ ఫామ్ కు దేశంలో ఎక్కడా లేని విదంగా పొల్యూషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారన్నారు.  చాలా మంది మంత్రులకు పౌల్ట్రీ ఫామ్ లు ఉన్నాయని.. వాళ్లకు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం ఉందా అని ప్రశ్నించారు.ఈటలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారన్నారు.