
మెగా హీరోలు, మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. తమిళంలో తెరకెక్కిన వినోదయసిత్తం రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. తమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల నడుమ 2023 జూలై 28 శుక్రవారం రిలీజ్ కానున్న బ్రో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు కథ :
ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు తంబిరామయ్య. అతను టైమ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలుంటారు. అయితే కంపెనీ పనిపై వేరే ప్రాంతానికి వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోతాడు. పిల్లలకు పెళ్లి చేయకుండా, మనవలు, మనరాళ్లతో ఆడుకోకుండా చనిపోయానేనని తంబిరామయ్య. ఆత్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో తంబిరామయ్య ఆత్మను తిరిగి తీసుకెళ్లేందుకు టైమ్ ఒక రూపంలో (సముద్రఖని) వస్తుంది. తన గోడునంతా టైమ్‌కు చెప్పుకొని తంబిరామయ్య బాధపడతాడు. తనని బతికించమని అడుగుతాడు. అందుకు టైమ్ 90 రోజులు గడువు ఇస్తుంది. మరి టైమ్ ఇచ్చిన సమయంలో తంబిరామయ్య ఏం చేశాడన్నది మిగితా కథ.
ఏ మార్పులు చేశారు
వినోదయసిత్తం సినిమాను చూసిన తమిళనాడుకు చెందిన ఓ డాన్ సముద్రఖనికి ఫోన్ చేసి ఏడ్చాడట. అప్పుడు త్రివిక్రమ్ పక్కనే ఏఉన్నారట. ఏమైందని త్రివిక్రమ్ అడిగితే వినోదయ సిత్తం కథ గురించి చెప్పారట సముద్రఖని. దీనిని తెలుగులో చేద్దామా అని వెంటనే అడిగారట త్రివిక్రమ్. ఓ స్టార్ హీరో ఈ సినిమా చేస్తే బాగుంటదని సముద్రఖని అన్నారట. దీంతో ఓ పది నిమిషాల్లో పవన్ కల్యాణ్ తో ఈ సినిమా చేస్తే నీకు ఓకేనా అని అడిగారట త్రివిక్రమ్. దీంతో సముద్రఖని షాకయ్యారట. అలా బ్రో సినిమా మొదలైంది.
- 15 రోజుల్లో స్ర్కీప్ట్ లో మార్పలు చేసి అంతా రెడీ చేశారు త్రివిక్రమ్, సముద్రఖని.
- ముందుగా డైలాగ్ రైటర్ గా సాయిమాధవ్ బుర్రాను అనుకున్నారు కానీ ఆయన బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ అ బాధ్యతను తీసుకున్నారు.
- పవన్ కల్యాణ్ కు కథ చెప్పిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశారు.
- 75 రోజులు చేయాల్సిన పవన్ పాత్రను 21 రోజుల్లోనే ఫినిష్ చేశారు.
- సాయిధరమ్ తేజ్ ను త్రివిక్రమ్ సెలక్ట్ చేశారు.
- సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవడంతో బ్రో సినిమాను కొద్ది రోజులు అపేశారు.
- వినోదయసిత్తంలో ఫాదర్, డాటర్ సెంటిమెంట్ ను కాస్త బ్రో సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ గా మార్చారు.
- వినోదయసిత్తంలో సాంగ్స్ ఉండవు, బ్రోలో మూడు సాంగ్స్ పెట్టారు.
- వినోదయసిత్తంలో ఫైట్స్ ఉండవు, బ్రోలో మూడు ఫైట్స్ పెట్టారు. అలాగే, సాయిధరమ్‌తేజ్ పాత్రకు లవ్ స్టోరీతో పాటు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు.
- వినోదయసిత్తం రన్‌టైమ్ 99 నిమిషాలు. కానీ బ్రో రన్ టైమ్ 135 నిమిషాలు.. పవన్ కల్యాణ్ పోషించిన టైమ్ క్యారెక్టర్ నిడివి పెంచారు.
- జర్వంతోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు పవన్ కల్యాణ్.