వానాకాలంలో బ్రైట్గా కనిపించేందుకు ఏ కలర్ డ్రెస్లు బెస్ట్.. జువెలరీ, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది..?

వానాకాలంలో బ్రైట్గా కనిపించేందుకు ఏ కలర్ డ్రెస్లు బెస్ట్.. జువెలరీ, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది..?

చాలామంది కాలంతో సంబంధం లేకుండా నచ్చిన దుస్తులు వేసుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు ఆ ఇష్టాలే ఇబ్బందులకు దారితీస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వర్షంలో తడి సినప్పుడు దుస్తుల తడి పల్ల స్కిన్ ఇన్ ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే ఈ సీజన్ కి అనుగుణంగా డ్రెస్ లను ఎంచుకోవాలి. అలాగే ఈ కాలంలో హెయిర్ స్టైల్స్, జువెలరీ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసు కోవాలి.

వానల్లో ఇలా:

ఈ కాలంలో అమ్మాయిలు పాదాల వరకు ఉండి, నేలకు తాకే గౌన్లు, సల్వార్ పటియాల వంటి డ్రెస్సుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఒంటికి అతుక్కు పోయేలా ఉండే డ్రెస్లకు దూరంగా ఉంటే వాన కురిసినా ఇబ్బంది ఉండదు. జీన్స్, వదులుగా ఉండే స్కర్ట్స్ బాగా బరువుండే దుస్తులు కూడా వర్షాకాలంలో సౌకర్యంగా ఉండవు.

ALSO READ : Health alert: ఫ్రూట్ జ్యూస్ ఎక్కువుగా తాగుతున్నారా.. కేన్సర్ రావచ్చు.. బీ అలర్ట్

ఈ రంగుల్లో

వర్షాకాలంలో వాతావరణం మబ్బులు పట్టి డల్ గా కనిపిస్తుంది. అందువల్ల మనలోనూ కాస్త ఆ డల్ ఫీలింగ్ ఉంటుంది. దీంతో చేసే పనుల మీద కూడా అంత ఏకాగ్రత ఉండదు. అందుకే ఈ సీజన్లో ఉత్సాహాన్నిచ్చే రంగులు సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అంటే, కలర్ ఫుల్ డ్రెస్సులన్నమాట! ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు పరిసరాలను కాంతివంతంగా చేస్తాయి. అందుకే ఇలాంటివి చాలా బెటర్. ఒకవేళ డార్క్ కలర్స్ నచ్చకపోతే లైట్ కలర్ దుస్తులు వేసుకుని వాటిపై చార్క్ కలర్ స్కార్ఫ్ కట్టుకుంటే అదిరిపోతుంది.

జువెలరీ కేర్

వర్షాకాలంలో బంగారం, వజ్రాల నగలకు ఎలాంటి హాని జరగకపోవచ్చు కానీ...వెండి నగల విషయంలోనే జాగ్రత్తలు తీసు కోవాలి. అవి వర్షాకాలంలో త్వరగా రంగు మారతాయి. అందుకే వాటిని టిష్యూ లేదా నూలు వస్త్రంలో చుట్టి జిప్ లాక్ బ్యాగుల్లో భద్రపరుచుకోవాలి. అలాగే వాటిని గాలి, వెలుతురు తగలని చోట ఉంచాలి.

హెయిర్ స్టైల్స్

ఈ కాలంలో హెయిర్ స్టయిల్ ను సింపుల్ గా ప్లాన్ చేసుకోవాలి. కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్ వాతావరణ పరిస్థితుల వల్ల చెదిరిపోయి చికాకు తెప్పిస్తాయి. అందుకే ఈ కాలంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే హెయిర్ స్టయిల్ ని ఎంచుకోవడం మంచిది. సన్న పాయలు తీసి బట్టర్ ఫ్లై క్లిప్ పెట్టి మిగిలిన జుట్టుని లూజుగా వదిలేయడం.. హై పోనీ... లేదా పిక్స్టైల్ ని ట్రై చేయొచ్చు. అలాగే వర్షాకాలంలో మంచి హెయిర్ వాషెస్ లేదా లైట్ హెర్బల్ షాంపూలతో తలస్నానం చేయాలి. కండిషనర్స్ ని ఎక్కువగా వాడకూడదు.