
కొజికోడ్: కేరళలోని కొజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో చాలా మంది ప్రాణాలు కాపాడగలిగారు. ఈ విషయాన్ని స్వయంగా చాలా మంది ప్రయాణికులు చెప్పారు కూడా. అయితే క్రాష్ అయిన ఐదు నిమిషాలకు కేరళ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది అనే విషయంపై ఒక నేషనల్ మీడియా సంస్థ కథనాన్ని రిలీజ్ చేసింది. 7:40కి ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే మొదట సీఐఎస్‌ఎఫ్ ఆఫీసర్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 7:40 కి ప్లేన్ క్రాష్ అవడం గమనించిన గేట్ నెం.8 అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్ సీఐఎస్‌ఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 7:41కి సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ సీఐఎస్‌ఎఫ్ క్విక్ రెస్పాన్స్ రూమ్‌కి కాల్ చేశారు. 7:42కి ఎయిర్‌పోర్ట్ ఫైర్ స్టేషన్‌ను అలర్ట్ చేశారు. 7:43కి సీఐఎస్‌ఎఫ్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేశారు. 7:44 సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ టర్మినల్ మేనేజర్ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు రెండోసారి కాల్ చేశారు. 7:45కి సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ లోకల్ పోలీసులు, ఏజెన్సీ యూనిట్ లైన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన 5 – 7 నిమిషాల్లో క్రాష్ గురించి తెలుసుకున్న స్థానికులు క్రాష్ గేట్ దగ్గరికి చేరుకున్నారు. స్థానికులు రావడాన్ని గమనించిన డిప్యూటీ కమాండెంట్ పరిమిత సంఖ్యలో మాత్రమే సహాయక చర్యల కోసం అనుమతించారు. సకాలంలో తీసుకున్న ఆ నిర్ణయం వల్ల చాలా మందిని కాపాడగలిగామని సీఐఎస్‌ఎఫ్ వర్గాలు చెప్పాయి. కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఒక ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలెట్లు సహా 18 మంది చనిపోయారు.