అసలు మందు తాగితే ఏమైతదో తెలుసా?

అసలు మందు తాగితే ఏమైతదో తెలుసా?

అవునూ.. తాగితే ఏమైతది? అని ఎవర్నైనా అడిగితే ‘కిక్కొస్తదని’ ఠక్కున చెప్పేస్తరు. ఇగ ఈ కిక్ అంటే ఏంటి? “అప్పటిదాకా మామూలుగా కనిపించిన మనిషి అప్పటికప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తాడు. హ్యాపీగా ఫీలవుతున్నట్లు కనిపిస్తాడు. మాటలు సంతోషంగా, ఆవేశంగా, గట్టిగా వస్తుంటాయ్. అలా అప్పటికప్పుడు మనిషిలో వచ్చేఈ మార్పే కిక్” అని చెప్తరు డాక్టర్లు. ఇంతకీ కిక్కెందుకు వస్తది? అంటే.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెదడు మరింత యాక్టివ్ అవుతది. దీంతో అది బాడీలోని మిగతా పార్స్ట్ కు వేగంగా మెసేజ్ లు పంపుతది. దీంతో నవ్వడం, ఏడవడం, పాటలు పాడడం, కొన్నిసార్లు డాన్సులు చేయడం చేస్తరు. ఇలా మైండ్ యాక్టివ్ కావడం వెనుక డోపమైన్ , ఎండార్ఫిన్ అనే హార్మోన్లు పని చేస్తయని సైంటిస్టులు గుర్తించిన్రు. మందుతాగిన వెంటనే ఈ హార్మోన్లు విడుదలై, మైండ్ ఆక్టివ్ కావడంతోనే తాగినోళ్లు అలా బిహేవ్ చేస్తారని చెప్పిన్రు. మందు తాగిన తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తది? ఏ పనీ చేయాలని ఎందుకు అనిపించదు? అంటే.. తినేదైనా, తాగేదైనా ప్రతిదానికీ ఒక లిమిట్ ఉంటది. మందు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మందు లిమిట్ గా తాగితే మెదడు ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్టివ్ గా మారుతుంది. లిమిట్ దాటితే మెదడు యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. దీనివల్ల నరాలు దెబ్బతింటయ్. గుండె కొట్టుకునే వేగం తగ్గుతది. ఊపిరి పీల్చుకోవడం, వదలడం కూడా స్లో అయితది. మందు మరీ ఎక్కువైతే ప్రాణం కూడా పోయే ప్రమాదముంది. డాక్టర్లు చెప్పేదాని ప్రకారం.. మందు ఎఫెక్ట్​ మనమీద నాలుగైదు దశల్లో ఉంటది. లాస్ట్​ స్టేజీ మాత్రం మరణమే. మందు ఎంత ఎక్కువగా తాగితే లాస్ట్​ స్టేజీకి అంత దగ్గరవుతాం. ఇక మందు తాగినప్పుడు అందులో ఉండే ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తది. దీంతో బాడీలోని అన్ని పార్స్ట్ కు మందు వెళ్ళిపోతది. వేరే ఆహార పదార్థాల కంటే మందు చాలా ఫాస్ట్​గా వెళ్తది. లివర్, మెదడు, హార్ట్​.. ఇలా అన్ని పార్స్ట్‌కు స్పీడ్‌గా మందు చేరుకుంటది. మెదడు దగ్గరికి వెళ్లిన మందు దానిని మొద్దు బారిపోయేటట్లు చేస్తది. దీంతో తాగినోళ్లు మత్తులోకి వెళ్లిపోతుంటరు.

ఇక సైంటిఫిక్ గా ఏం జరుగుతదంటే..

జీర్ణాశయంలోకి వెళ్లిన ఆల్కహాల్ ను విడగొట్టి, జీర్ణం చేసేందుకు లివర్ తన పనిని మొదలు పెడ్తది. ఇందుకోసం ఎంజైమ్ లను విడుదలచేస్తది. ఈ ఎంజైమ్ లు ఆల్కహాల్(ethanol- C2H5OH)ను మొదట ఎసిటాల్డిహైడ్‌‌ (ethanal- C2H4O)గా విడగొడ్తది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌‌–డై–ఆక్సైడ్‌‌గా విడిపోతది. ఇదంతా జరిగేటప్పుడు క్యాలరీల రూపంలో ఎనర్జీ కూడా విడుదలైతది.ఈ క్యాలరీలు ఎక్కువ కావడంతోనేమందుతాగేవారు బరువు పెరుగుతరు.మందు ఎక్కువగా తాగేవారికి కేవలం క్యాలరీలు మాత్రమే అందుతాయి.అంతేకాదు తాగినప్పుడు చాలా తక్కువగాతింటరు. దీంతో మిగతా పోషకాలేవీ అందకపోగా..కేవలం కేలరీలు మాత్రం అందడంతో తాగెటోళ్లు తొందరగా బరువు పెరుగుతరు. పోషకాలు అందక పోవడంతో నీరసంగా, అనారోగ్యంగా కనిపిస్తరు. ఏ పనులనూ యాక్టివ్ గా చేయలేకపోతరు. మందు ఎసిటాల్డిహైడ్ గా మారినప్పుడు అదిలివర్ ను దెబ్బతీస్తది. దీనివల్ల హెపటైటిస్, లివర్ క్యాన్సర్, అల్సర్ లాంటివి వచ్చే ప్రమాదముంది.

మందు తాగెటోళ్లు కామన్​గా వాంతులు​ చేసుకోవడం చూస్తనే ఉంటం. దీనికి కారణం కూడా ఎసిటాల్డిహైడే. ఇదే వాంతులకు కారణమని సైంటిస్టులు ఇటీవలే తేల్చిచెప్పిన్రు. మందు ఎంత ఎక్కువ తాగితే.. అంత ఎక్కువగా వాంతులు అవుతయ్. ఏదైనా తినగానే వామ్టింగ్స్​, మోషన్స్​ అవుతున్నయంటే.. మీ బాడీ నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపాలని మెదడు చెప్తోందని అర్థం. వాంతులు అనేవి.. ఇక తాగడం ఆపమని మెదడు ఇచ్చే లాస్ట్​ ఇండికేషన్​.

ఇక తాగినోళ్లు ఎక్కువగా ఫేస్​​ చేసే సమస్య హ్యాంగోవర్​. నిజానికి దీన్ని తగ్గించేందుకు మందులేవీ లేవట. హ్యాంగోవర్​ మొదలైందంటే వెంటనే తాగుడుకు కాస్త రెస్ట్​ ఇవ్వడమే సొల్యూషన్​. ఎందుకంటే..  లివర్​ ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్​ను మాత్రమే జీర్ణం చేయగలదు.

  •   అంతకు మించి తాగితే వాంతులు​ అయి.. బాడీ డీహైడ్రేట్​ అవుతుంది. దీనివల్ల కూడా హ్యాంగోవర్​ ఉంటది.
  •   కొన్నిరకాల బ్రాండ్​లు రక్తనాళాలను ముడుచుకు పోయేలా చేస్తయ్.
  •   దీనివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశముంది.   దీనికి సొల్యూషన్​ నీళ్లు తాగడం మాత్రమే.

అప్పుడు శరీరంలో తగినంత నీళ్లు చేరి, రక్తనాళాలను మళ్లీ మొదటిస్థితికి తీసుకొస్తయ్​. దీనివల్ల హ్యాంగోవర్​ చాలావరకు తగ్గిపోతది. తాగిన వెంటనే కొందరు బాత్రూమ్​కు వెళ్లిపోతరు. ఇలా ఎందుకంటే.. పిట్యూటరీ గ్లాండ్​పై మందు పనిచేస్తది. దీంతో అది వాసోప్రెసిన్‌‌ అనే హార్మోన్‌‌ను విడుదల చేస్తది. ఈ హార్మోన్​  శరీరం నుంచి నీళ్లను మరింత ఎక్కువగా బయటకు పంపుతది. అందుకే మందు తాగిన వెంటనే బాత్రూమ్​కు వెళ్తరు. అయితే ఇలా ఎక్కువసార్లు బాత్రూమ్​కు వెళ్లడం వల్ల కూడా బాడీ డీహైడ్రేట్​ అవుతుంది. దీనివల్ల కూడా హ్యాంగోవర్​గా అనిపిస్తది.