
కల్వకుర్తి, వెలుగు: మూడు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉండి జైపాల్ యాదవ్ నియోజకవర్గానికి ఏం చేశారని ఏఎంసీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం సంజయ్ యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏనాడు వంద పడకల ఆసుపత్రి గురించి పట్టించుకోని జైపాల్‌రెడ్డి ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.
ఎలక్షన్ల ముందు హడావుడిగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా జీవో సృష్టించి, హరీశ్‌రావుతో కొబ్బరికాయ కొట్టించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైస్ చైర్మన్ పండిత్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.