
- ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం
ముషీరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోగా మైనార్టీలకు 12 శాతం రిజర్వే షన్లు కల్పిస్తామని 2014లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్... పదేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని కర్నాటక మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలకు మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి రాంనగర్ గుండు చౌరస్తాలో ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత మనోహర్ సింగ్ తన అనుచరులతో కలిసి జమీర్ అహ్మద్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జమీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మైనార్టీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వారి సంక్షేమాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన కోరారు. అంజన్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం మాటలతో మూటలు కట్టి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్కు అధికారం ఇస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తిరుమల రావు, రమేశ్ బాబు, అన్సారీ ఖాన్, ప్రపూల్ రాంరెడ్డి, టీజేఎస్ నాయకుడు నరసయ్య పాల్గొన్నారు.