బదిలీకి వీలుకానిదే ప్రత్యక్ష పన్ను

బదిలీకి వీలుకానిదే ప్రత్యక్ష పన్ను

పన్ను భారాన్ని భరించేవారిని బట్టి పన్నులు రెండు రకాలు. అవి.. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే ద్రవ్యమే ద్రవ్యభారం. ఈ భారం రెండు రకాలు. పన్ను ఆరంభ భారం లేదా తొలి భారం, తుది భారం లేదా అంతిమ భారం. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు దాన్ని మొదటిగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే పన్ను తొలిభారం. కాగా పన్ను చిట్టచివరికి ఎవరు చెల్లిస్తారో లేదా ఎవరు భరిస్తారో ఆ భారమే అంతిమ భారం. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మకంపన్ను విధిస్తే మొదటిసారి వస్తువును అమ్మేవారు దాని తొలిభారం భరించగా, వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారుడు తుదిభారాన్ని భరిస్తాడు. 

ప్రత్యక్ష పన్ను: పన్ను తొలి, తుది భారాలు ఒకే వ్యక్తి భరిస్తే అంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలులేకపోతే అది ప్రత్యక్ష పన్ను. ఉదాహరణకు ఆదాయపు పన్ను, వృత్తి పన్ను, కార్పొరేట్​ పన్ను, బహుమతి పన్ను, స్టాంప్​ డ్యూటీ, వడ్డీ పన్ను, ఎస్టేట్​ డ్యూటీ (మరణించిన వ్యక్తి ఆస్తులు వారసులకు సంక్రమింపజేసేటప్పుడు విధించే పన్ను ఎస్టేట్​ డ్యూటీ/ మరణ సుంకం/ వారసత్వ పన్ను), క్యాపిటల్​​ గెయిన్​ ట్యాక్స్​, వ్యయంపై పన్ను, ఫ్రింజ్​ బెనిఫిట్​ ట్యాక్స్​ (ఒక కంపెనీ తన ఉద్యోగులకందించే సౌకర్యాలపై ప్రభుత్వం విధించే పన్ను).

పరోక్ష పన్ను: పన్ను తొలిభారం ఒకరిపైన, అంతిమభారం మరొకరిపైనా పడితే అంటే పన్ను భారాన్ని బదిలీ చేసే వీలుంటే అది పరోక్ష పన్ను. ఉదాహరణ: కేంద్ర ఎక్సైజ్​ సుంకం, కస్టమ్స్​ సుంకాలు, సేవా పన్ను, రాష్ట్ర అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్​ సుంకం, మోటారు వాహనాలపై పన్ను, విద్యుచ్ఛక్తిపై పన్ను (విద్యుత్​ను ఉత్పత్తి చేసి పంపిణీ చేసే సంస్థలపై విధిస్తారు), వినోదపు పన్ను, ఆక్ట్రాయ్​ పన్ను (మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోకి వస్తువులు ప్రవేశించినప్పుడు విధించే పన్ను). 

పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు మధ్య సంబంధం బట్టి పన్నులు నాలుగు రకాలు: పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేది పన్ను ప్రాతిపదిక గా, ఎంత శాతం పన్ను విధించబడుతుందో తెలియజేసేది పన్నురేటు. ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను పరిధి.

అనుపాతపు పన్ను: పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగినా పన్నురేటు మారకుండా స్థిరంగా ఉంటే అది అనుపాతపు పన్ను. ఆదాయం ఎంత పెరిగినా పన్నురేటులో మార్పురాదు. ఉదాహరణ: అమ్మకపు పన్ను, సేవాపన్ను, ఎక్సైజ్​ సుంకం. ఇందులో తక్కువ ఆదాయం పొందేవారు కోల్పోయే త్యాగం కంటే ఎక్కువ ఆదాయం పొందేవారు కోల్పోయే త్యాగం తక్కువగా ఉంటుంది. 

పురోగామి పన్ను: పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగితే అది పురోగామి పన్ను. అంటే పన్ను ప్రాతిపదికకీ, పన్నురేటుకీ అనులోమ సంబంధం ఉంటుంది. భారత్​లో ఆదాయపు పన్ను ఈ వర్గీకరణకు చెందిందే. ధనికులపై అధిక పన్ను, పేదలపై తక్కువ పన్నులనూ ఇది సూచిస్తుంది. అంటే చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఈ పన్ను విధిస్తారు. పురోగామి పన్నుల వల్ల ఆదాయ అసమానతలు తగ్గుటయేకాక సాంఘిక న్యాయం జరుగుతుంది. ఆడంస్మిత్​ పేర్కొన్న పన్ను నియమాల్లో సమతా నియమాన్ని పురోగామి పన్ను సంతృప్తి పరుస్తుంది. 

తిరోగామి పన్ను: పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్నురేటు తగ్గితే అంటే ఆదాయానికి, పన్నురేటుకి విలోమ సంబంధం ఉంటే అది తిరోగామి పన్ను. ఇందులో ధనవంతుడిపై తక్కువ పన్నుభారం. పేదవాడిపై ఎక్కువ పన్నుభారం పడుతుంది. భారత్​లో ఈ పన్ను లేదనే చెప్పాలి. 

డిగ్రేసివ్​ పన్ను: ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు నెమ్మదిగా పెరిగి ఒక దశ తర్వాత పన్నురేటులో మార్పు రాకపోతే అది డిగ్రేసివ్​ పన్ను. ఇందులో పురాగామితత్వం ఉన్నా అది క్షీణిస్తూ ఒక దశ తర్వాత పన్నురేటు స్థిరంగా ఉంటుంది. 

పన్ను విధింపు కాలంబట్టి పన్నులు రెండు రకాలు

తాత్కాలిక పన్ను: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడానికి విధించే పన్ను తాత్కాలిక పన్ను. ఉదాహరణకు యుద్ధ సమయంలో విధించే సర్​చార్జీలు. యుద్ధం ముగిసిన తర్వాత దీన్ని రద్దు చేయవచ్చు. 1860లో మన దేశంలో ఆదాయపు పన్నును తాత్కాలిక ప్రాతిపదికపై ఐదు సంవత్సరాల కాలానికి విధించారు. 

శాశ్వత పన్ను: శాశ్వత ప్రాతిపదికపై విధించే పన్ను శాశ్వత పన్ను. ఉదాహరణకు అమ్మకపు పన్ను. 1886లో భారత్​లో ఆదాయ పన్నును పున: ప్రవేశపెట్టిన తర్వాత నిరవధికంగా విధిస్తారు. 

పన్ను విధింపు ఆధారంగా రెండు రకాలు.

నిర్దిష్ట పన్ను, అడ్వలోరెమ్​ పన్ను.

నిర్దిష్ట పన్ను: వస్తువు బరువును బట్టి గానీ సంఖ్యను బట్టి గానీ కొలతను బట్టి గానీ విలువతో సంబంధం లేకుండా పరిమాణం బట్టి గానీ విధిస్తే దానిని నిర్దిష్ట పన్ను అంటారు. ఉదా: వినోదపు పన్ను. 

అడ్వలోరెమ్​ పన్ను: వస్తు ద్రవ్య విలువను బట్టి పన్ను విధిస్తే అది విలువ ఆధారిత పన్ను. సాధారణంగా వస్తు విలువలో కొంత శాతాన్ని పన్నుగా విధిస్తారు. ఉదాహరణకు సేల్స్​ ట్యాక్స్​ మన దేశంలో ఎక్కువ పన్నులు ఈ రకానివే. కస్టమ్స్​ సుంకాలు విలువను బట్టి విధిస్తారు. ధర పెరిగే కొద్దీ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. 

పన్ను విధింపు స్థానం బట్టి పన్నులు రెండు రకాలు

ఏకస్థాన పన్ను: ఉత్పత్తిలో ఒక దశలోనే పన్ను విధించడం.