కరోనా మహమ్మారి తరువాత ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో పేరు.. వెట్‌ల్యాండ్ వైరస్. ఈ మహమ్మారి గురించి గత నాలుగు రోజులుగా కుప్పలు తిప్పలుగా కథనాలు వస్తున్నాయి. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద జర్నల్స్ ఈ వైరస్ గురించి కథలు కథలుగా ప్రచురిస్తున్నారు. అంతలా ప్రపంచాన్ని భయపెడుతుండటానికి ప్రధాన కారణం.. దీని పుట్టుక చైనాలో ఉండటమే.
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉన్న వారిని ఈ వైరస్ ఏమీ చేయలేకపోయిన.. అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రిలో బెడ్లు దొరక్క సామాన్యులు తల్లడిల్లిన దృశ్యాలు ఎన్నో మన కళ్లకు కనిపించాయి. అలాంటి మహమ్మారి పురుడు పోసుకున్న చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. అదే వెట్‌ల్యాండ్ వైరస్((wetland virus)). చిత్తడి నేలల్లో నివసించే పురుగులు(నల్లుల వంటివి) ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందడంతో ఈ పేరొచ్చింది.
ఎలా సోకుతుందంటే..?
ఈ వైరస్ జంతువుల్లో రక్తాన్ని పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపిన్నట్లు నిపుణులు నిర్ధారించారు. పురుగుల కాటు ద్వారా ఇది సంక్రమిస్తున్నట్లు తేల్చారు. దీని బారిన వారు చికిత్స అనంతరం కోలుకుంటున్నప్పటికీ, ఇది నాడీకణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు.
వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు
వెట్‌ల్యాండ్ వైరస్ సోకిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలను కనిపించనప్పటికీ.. జ్వరం, మైకము, తలనొప్పి, అనారోగ్యం, మైయాల్జియా, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటివి అందరిలోనూ ఉంటాయి. కొందరిలో చర్మం లేదా శ్లేష్మ పొరలపై గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి.
- జ్వరం: చలితో కూడిన జ్వరం ఉంటుంది
- అలసట: బాగా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు.
- తలనొప్పి: నిరంతర తలనొప్పి.
- శరీర నొప్పులు: ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతుంటాయి.
- దద్దుర్లు: కొందరిలో చర్మం లేదా శ్లేష్మ పొరలపై గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి.
నివారణ
- వెట్‌ల్యాండ్ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మొదట పురుగుల కాట్లను నిరోధించాలి.
- రక్షిత దుస్తులు ధరించడం: చెట్లతో కూడిన, గడ్డి లేదా చిత్తడి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. పాదాలను, చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, బూట్లు ధరించండి.
- నల్లుల నుంచి రక్షణ: బయట తిరిగే సమయాల్లో శరీరంపై నల్లులు లేదా పేలు వంటి పురుగులు ఉన్నాయేమో క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఉంటే వాటిని వెంటనే తొలగించండి.