
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మహిళలను టెర్రరిస్టులుగా మార్చేందుకు జైషే -మొహమ్మద్ ఆన్‌లైన్ జీహాదీ కోర్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 'జమాత్ ఉల్-ముమినాత్' పేరిట తొలి మహిళా టెర్రరిస్ట్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కోర్స్ ఫీజును 500 పాకిస్తానీ రూపాయలు(భారత కరెన్సీలోరూ.156)గా నిర్ణయించింది.
దీనిద్వారా పాకిస్తాన్ మహిళలను టెర్రరిస్టులుగా మార్చడంతోపాటు టెర్రరిజాన్ని మరింత బలోపేతం చేయాలని జైషే గ్రూప్ భావిస్తోంది. 'జమాత్ ఉల్-ముమినాత్' మహిళా టెర్రరిస్టుల గ్రూపును ఈ నెల 8న ప్రకటించగా..19న పీవోకేలో 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే ఆన్‌లైన్ జీహాదీ కోర్సు ఆసక్తి ఉన్న మహిళలను జాయిన్ చేసుకున్నారు.