
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'OG' (They Call Him OG'). సెప్టెంబర్ 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.308 కోట్లకు పైగా గ్రాస్, ఇండియా వైడ్గా రూ.192 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. పవన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీగా ఓజీ నిలిచింది. థియేటర్లలో అభిమానులను ఉర్రూతలు ఊగించిన ఈ మూవీ ఇప్పుడు OTTలో అడుగుపెట్టింది. అయితే, నెలరోజులు తిరగకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఓజీ OTT:
పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టార్ థ్రిల్లర్ 'OG' మూవీ ఇవాళ (2025 అక్టోబర్23న) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందువల్ల.. పవన్ ఫ్యాన్స్గా 18 సంవత్సరాల లోపు పిల్లలు థియేటర్లో చూడలేకపోయాయరు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన ఓజీని చూసే ఛాన్స్ వచ్చింది. ఇది వారికి ఓ రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇకపోతే 'OG' మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
డివివి దానయ్య DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా, పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాల ప్రణాళికలో 'OG' సీక్వెల్, ప్రీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సుజీత్ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. చూడాలి మరి ఏమవుతుందో!
Bombay has seen many storms. Only one left a scar and They call him OG! 😤 pic.twitter.com/PfOzFR8YYj
— Netflix India (@NetflixIndia) October 22, 2025
కథేంటంటే:
1970 జపాన్లో సమురాయ్ వంశాల కథతో మొదలవుతుంది. కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్య దాదా (ప్రకాష్ రాజ్). ఆయనతో పాటు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) కూడా ముంబై వస్తాడు. సత్యా దాదా చుట్టూ ఒక కోటలా, రక్షణలా నిలబడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు గంభీరా.
ఈ క్రమంలో సత్యదాదా ముంబాయిలో పోర్ట్ కడతాడు. కానీ, సత్యదాదా కుటుంబానికి స్నేహితుడు మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) తోపాటు అతని కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మి) వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జిమ్మి అనేవాడు సత్యదాదా రెండో కొడుకుని ఓ కారణంచేత చంపుతాడు. ఆ తర్వాత ఓమి (ఇమ్రాన్ హష్మీ) సైతం ఎంట్రీ ఇచ్చి సత్యా దాదా మనుషులను చంపేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ముంబైకి రావాల్సి వస్తుంది ఓజాస్ గంభీరా. అప్పుడు ఏం జరిగింది?
ఓమీ ముంబై రావడానికి అసలు కారణం ఏంటీ? సత్యాదాదా కొడుకులకు ఏమైంది? మధ్యలో ఈ కన్మణి (ప్రియాంక మోహన్) ఎవరు? ఆమె గంభీర జీవితంలోకి ఎలా వచ్చింది? అర్జున్ దాస్, శ్రియా రెడ్డి పాత్రల వెనుక స్టోరీ ఏంటీ? ఓజీకీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏంటీ? చివరికి ఓమీతో ఓజీ ఎలాంటి యుద్ధం చేశాడనేది మిగిలిన కథ.