వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  •  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొంది అధిక లాభాలు అర్జించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి, జంగంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వడ్లను విక్రయించాలని రూ.2,389 మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ పొంది అధిక లాభాలు పొందాలని  రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శాంతినిర్మల,  తహసీల్దార్ గణేశ్ నాయక్,  ఏపీఎం వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, ఉప సర్పంచ్ భరత్ గౌడ్, ఐకేపీ సంఘాల మహిళలు తదితరులు ఉన్నారు.