ఏజ్ ఒక సమస్యనా..? ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం

ఏజ్ ఒక సమస్యనా..? ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం

నటుడు రాహుల్ దేవ్‌తో తన రిలేష‌న్ షిప్, త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న వయసు తేడా గురించి చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సే. తెలుగు, త‌మిళ, హిందీ చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన‌ రాహుల్‌దేవ్‌(52)తో గ‌త కొన్నేళ్లుగా ముగ్ధా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌దేవ్‌, తాను తమ బంధం ప‌ట్ల ఎంతో సంతోషంగా ఉన్నామ‌ని , తమ ప్రేమ‌కు ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సు స‌మ‌స్య ఎప్పుడు రాలేద‌ని..తెలిపింది. ‘భాగ‌స్వామిని ఎంచుకోవ‌డం అంటే షాపింగ్ చేయ‌డం వంట‌ది కాదు క‌దా.. నాకు ఈ క‌ల‌ర్ బ్యాగ్ న‌చ్చింది కాబ‌ట్టి కొనుగోలు చేశాను అన్న‌ట్లుగా ఉండ‌దు కదా.. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రికైనా ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలోకి వ‌స్తేనే ఈ విష‌యం అర్ధ‌మ‌వుతుంది. వ‌య‌సుతో అస‌లు సంబంధం ఉండ‌దని, ఇప్పుడు త‌మ జీవితం ఎంతో జాయ్‌ఫుల్‌గా న‌డుస్తుంద‌ని’ ముగ్ధా గాడ్సే చెప్పుకొచ్చారు.

కాగా రాహుల్‌ దేవ్‌కు గతంలో రీనాతో వివాహం జరిగింది. వీరికి సిద్ధాంత్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2009లో క్యాన్సర్‌ బారిన పడి రీనా మరణించడంతో రాహుల్‌ ఒంటరివాడయ్యాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో ముగ్ధాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ముగ్ధా రాహుల్‌ కంటే వయసులో 18 ఏళ్లు చిన్నది. వీరి ప్రేమ బంధానికి త్వ‌ర‌లోనే ఎనిమిదేళ్లు నిండ‌బోతున్నాయి.