దూసుకెళ్లటమే : ఇండియా బుల్లెట్ రైలు ఇలా ఉంటుంది

దూసుకెళ్లటమే : ఇండియా బుల్లెట్ రైలు ఇలా ఉంటుంది

భారత్ లో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా ? అని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య  నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు  ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని యానిమేషన్ వీడియోను  కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్లో  పోస్ట్ చేశారు. 

గంటకు గరిష్టంగా 320 కి.మీ  స్పీడ్ తో వెళ్లే  ఈ రైలు గురించి ప్రస్తావించారు. తమ ప్రభుత్వం కలలు కాదు వాస్తవాలను సృష్టిస్తోందంటూ  ట్వీట్ చేశారు. మోడీ 3.0 పాలనలో బుల్లెట్ రైలు కోసం ఎదురుచూడండంటూ పోస్ట్ చేశారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గుతుందని అంచనా.

బుల్లెట్ ట్రైన్ కోసం 24 రివర్ బ్రిడ్జిలు,28 స్టీల్ బ్రిడ్జిలు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నె్ల్, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్, 12 స్టేషన్ల నిర్మాణం జరగనుంది. మన దేశంలో  మొదటి బుల్లెట్ రైలు గుజరాత్ లోని బిలిమోరా- సూరత్ మధ్య 50 కి.మీల విస్తీర్ణంతో   2026 ఆగస్టులో పూర్తవుతుందని రైల్వే మంత్రి ప్రకటించారు.