RCB: బెంగళూర్ టాప్2 ఆశలకు గండి పడ్డట్లేనా..! క్వాలిఫైర్ 1 గా నిలవాలంటే ఆర్సీబీ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

RCB: బెంగళూర్ టాప్2 ఆశలకు గండి పడ్డట్లేనా..! క్వాలిఫైర్ 1 గా నిలవాలంటే ఆర్సీబీ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

ఐపీఎల్-2026 లో అందరి కంటే మంచి ఆరంభంతో మొదలు పెట్టి ఈసారి కూడా కప్పు నమ్దే.. అని ఫ్యాన్స్ అనుకునేలా వీరవిహారం చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. కీలక దశలో ఢీలా పడుతోంది. టాప్2 ప్లేస్ లపై కన్నేసిన ఆర్సీబీ మొన్నటి వరకు అది మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ ఆర్సీబీ ఆశలకు గండి కొడుతూ గురువారం (మే 07) లక్నో పెద్ద షాకే ఇచ్చింది. ఎలిమినేట్ అవుతుందనుకున్న లక్నో.. ఆర్సీబీకి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. 

ఐపీఎల్ లో మొదటి నాలుగు మ్యాచ్ లు గెలిచి బెస్ట్ ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన ఆర్సీబీ.. టాప్ 2 ఆశలు గల్లంతయ్యే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. లక్నోతో ఓటమితో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో పై రెండు స్థానాలను హైదరాబాద్, పంజాబ్ ఆక్యుపై చేసుకున్నాయి. లీగ్ దశలో బెంగళూర్ కు ఇంకా నాలుగు మ్యాచ్ లు మిగిలే ఉన్నాయి. ఈ 4 గేమ్స్ లో హైదరాబాద్, పంజాబ్ లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అయితే ఈ రెండు టీమ్స్ పైన గెలిస్తే క్వాలిఫైర్ 1 ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ ఓడిపోతే మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి లేకపోలేదు. టాప్ 4 స్థానం కూడా ఆర్సీబీకి కష్టతరమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి టైమ్ లో ఆర్సీబీ ప్లే-ఆఫ్ అవకశాలు ఎలా ఉన్నాయో చూద్దాం:

RCB ప్లే ఆఫ్ మార్గాలు:

కేస్ 1: 
ఒకవేళ ఆర్‌సిబి మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో (ముంబై, కోల్ కతా, పంజాబ్, హైదరాబాద్ లతో) అన్నింటిలోనూ గెలిస్తే,  20 పాయింట్లతో  దాదాపుగా టాప్-2 స్థానాన్ని ఖాయం చేస్తుంది. 

కేస్ 2: 

ఒకవేళ ఆర్‌సిబి తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో గెలిస్తే, 18 పాయింట్లు పొందుతుంది.  ప్రస్తుతం ఉన్న రన్ రేట్ (+1.234)ను అలాగే కొనసాగిస్తే.. అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ లేదా పిబికెఎస్ లాంటి  టీమ్స్  కూడా 18 పాయింట్లే పొందితే.. రన్ రేట్ కారణంగా  మిగతా జట్లకంటే పై స్థానంలో  ఉంటుంది. ఇది జరగాలంటే  హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ లేదా పిబికెఎస్‌ను తప్పక ఓడించాలి.

కేస్ 3: 

ఒక వేళ ఆర్సీబీ 16 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తే..  టాప్-టూ స్థానం కష్టతరమవుతుంది. అది ఇతర ఫలితాలపై  ఆధారపడి ఉంటుంది. ఒకవేళ RCB తమ చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో గెలిస్తే,  రెండవ స్థానంలో లేదా అంతకంటే మెరుగైన స్థానంలో నిలవాలంటే, SRH  మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో ఓడిపోవాలి. లేదా PBKs మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం మూడింటిలో ఓడిపోవాలి. దీనికి తోడు  రాజస్థాన్, గుజరాత్  (ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నవి) తమ మిగిలిన మ్యాచ్‌లలో రెండింటి కంటే ఎక్కువ గెలవకూడదు.

ఇంత  గందరగోళం లేకుండా టాప్ 2 లో ఉండాలంటే.. RCB  తమ రెండు మ్యాచ్‌లలో గెలవాలి.  భారీ నెట్ రన్ రేట్ (NRR) మెయింటైన్ చేస్తే..  మరో మూడు మ్యాచ్‌లలో గెలిస్తే, 18 పాయింట్లతో ఉన్న ఏ టీమ్ నైన అధిగమించి టాప్ 2కి వెళ్లడం ఈజీ.  అలా కాకుండా ఓటమి చవిచూస్తే.. పాయింట్స్ టేబుల్ లో  ఎలిమినేటర్ దశలో మూడు లేదా నాలుగో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. .