
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఫెయిలవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. త్వరలోనే పుంజుకుంటారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. వారిద్దరిపై పూర్తి నమ్మకం ఉందన్నాడు. ‘ఈ ఇద్దరూ గొప్ప ప్లేయర్లు. కచ్చితంగా ఫామ్‌లోకి వస్తారు. చాలా తొందర్లోనే వీళ్లు రన్స్ చేయడం చూస్తాం. విరాట్ మనసులో ఏముందో నాకు తెలియదుగానీ, అతను పుంజుకుంటాడనే నమ్మకం మాత్రం ఉంది’ అని దాదా పేర్కొన్నాడు. ఇక, ఈసారి ఐపీఎల్‌ను చాలా దగ్గర్నించి చూస్తున్నానని, కొత్త ఫ్రాంచైజీలు కూడా బాగా ఆడుతున్నాయని గంగూలీ చెప్పాడు. ఎవరైనా విజేతగా నిలువొచ్చన్నాడు.