ఎంత ఖరీదైన ఫోన్ ఉన్నా, నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేయడం కుదరదు. అలాగే రోజువారీ పనులు, ఉద్యోగానికి సంబంధించిన వర్క్స్ అన్నీ మొబైల్‌తోనే ముడిపడి ఉంటాయి. మరి అలాంటప్పుడు సిగ్నల్ సరిగా లేకపోతే ఎలా?
సిగ్నల్ స్ట్రెంత్ పెంచడానికి..
- మొబైల్ సిగ్నల్ సరిగా లేనప్పుడు ఫోన్‌ని రీబూట్ చేయాలి.
- ఎయిర్ ప్లేన్ మోడ్‌ని ఆన్ లేదా ఆఫ్ చేయాలి.
- సిమ్ కార్డ్ సరిగా ఉందో లేదో చెక్ చేయాలి.
- సిగ్నల్ స్ట్రెంత్ స్మార్ట్ ఫోన్లో వాడే సిమ్ కార్డ్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది.
- సిమ్ కార్డ్ పై డస్ట్ ఉంటే సిగ్నల్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది.
- సిమ్ కార్డ్‌ని మైక్రో ఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేశారో లేదో చూసుకోవాలి.
- సిమ్ కార్డ్‌పై చిన్న గీతలు పడినా సిగ్నల్ స్ట్రెంత్ ఇంటరప్ట్ అయ్యి సిమ్ పాడయ్యే అవకాశం ఉంది. అప్పుడు కొత్త కార్డ్ వేయాలి.
- కొన్ని ప్రాంతాల్లో 4జీ లేదా 5జీ నెట్‌వర్క్‌లకు ఫుల్ సిగ్నల్ స్ట్రెంత్ లేదు. స్మార్ట్ ఫోన్లలో వీక్ సిగ్నల్ ఉంటే నెట్వర్క్ మోడ్ మార్చాలి. స్మార్ట్ ఫోన్లను 4జీ లేదా 5జీ నుంచి 2జీ లేదా 3జీ నెట్ వర్క్‌లకు మార్చొచ్చు. యూజర్లు నెట్వర్క్ మోడ్‌ని మాన్యువల్‌గా సెలక్ట్ చేసుకోవాలి.
ఆండ్రాయిడ్‌లో..
నెట్వర్క్ సెట్టింగ్స్‌కి వెళ్లి సిమ్ కార్డ్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేయాలి. అడ్జెస్ట్ చేయడానికి సిమ్ కార్డ్ స్లాట్‌ను క్లిక్ చేయాలి. తర్వాత ప్రైమరీ నెట్వర్క్ టైప్ ఆప్షన్ని సెలక్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది.
ఐ–ఫోన్ అయితే..
సెట్టింగ్స్‌లో సెల్యులార్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సెల్యులార్ డాటా ఆప్షన్లో ‘4జీ స్టార్ట్’ స్టాప్ చేయాలి. అప్పుడు 5జీ లేదా 4జీ నెట్‌వర్క్‌లు వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ పెరుగుతుంది. సెల్యులార్ నెట్‌వర్క్‌లకు బదులు ఫోన్లోని కాలర్ సెట్టింగ్స్‌లో వైఫై సిగ్నల్ యాక్టివేట్ చేయొచ్చు. పబ్లిక్ నెట్వర్క్ కాకుండా నమ్మకమైన నెట్‌వర్క్‌లో మాత్రమే ఇది సేఫ్.