
తిన్న తర్వాత నిద్రమత్తు వస్తుంటుంది చాలామందికి. దీనివల్ల ఆఫీసులో పని డిస్టర్బ్ అవ్వడమే కాకుండా అలసటగా కూడా అనిపిస్తుంది. అయితే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా నిద్రమత్తు రాకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే..
- మధ్యాహ్నం టైంలో నాన్ వెజ్, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం వాటిని అరిగించడానికి ఎక్కువ కష్టపడుతుంది. అందుకే తిన్న వెంటనే అలసిపోతారు చాలామంది. దానివల్లనే మగతగా అనిపిస్తుంటుంది. కాబట్టి మధ్యాహ్నం టైంలో తేలికగా అరిగే ఆకుకూరలు, కూరగాయలు లాంటివి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
- ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం తీసుకునే ఫుడ్‌లో ట్రిఫ్టోఫాన్ ఉండే పాలు, చికెన్, చీజ్, నట్స్, బ్రెడ్ లాంటివి తీసుకోకూడదు. పగటిపూట నిద్ర రాకూడదంటే ముందురోజు సరిపడా నిద్రపోవాలి. అంతగా మగత వస్తుంటే ఓ పావుగంట సేపు పవర్‌న్యాప్ వేయాలి. ఇలా చేస్తే మగత తగ్గి, యాక్టివ్‌గా ఉండొచ్చు.
- రోజూ ఒకేటైంలో నిద్రపోయేలా ప్లాన్ చేసుకుంటే స్లీప్ సైకిల్‌లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాత్రిళ్లు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉంటే పగటిపూట నిద్ర రాదు.