మనసు బాగలేనప్పుడు ఏం చేయాలంటే?

మనసు బాగలేనప్పుడు ఏం చేయాలంటే?

కొన్నిసార్లు ఏం చేద్దామన్నా  మనసొప్పదు.  జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. మనసంతా ఆలోచనలతో నిండిపోతుంది.  మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే...

  • మనసు బాగాలేనప్పుడు మనసుకి నచ్చిన వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పాలి. చిన్ననాటి ఫ్రెండ్స్​తో మాట్లాడితే మైండ్ రిలాక్స్​అవుతుంది
  • బాధలో ఉన్నప్పుడు హ్యాపీ మూమెంట్స్​ని గుర్తుచేసుకోవాలి. దానివల్ల మనసులో కొత్త ఉత్సాహం నిండుతుంది.  ఒత్తిడి నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.
  • ఏదన్నా యోగాసనంలో కాసేపు ఉన్నా మైండ్​ రిఫ్రెష్​ అవుతుంది. నచ్చిన పాటలు విన్నా, అలిసిపోయే వరకు డాన్స్​ చేసినా మనసు కాస్త కుదుటపడుతుంది. 
  • ఒత్తిడిలో  ఉన్నప్పుడు కాసేపు పచ్చని చెట్లు, పక్షులు, జంతువుల మధ్య గడపాలి.  అలాగే మొక్కలు నాటినా, గార్డెనింగ్​ చేసినా  రిజల్ట్​ బాగుంటుంది.
  • పిల్లలతో ఆడి, పాడినా ఒత్తిడి మాయమవుతుంది. అందుకే మనసు బాగాలేనప్పుడు వాళ్లతో ఒక అరగంట టైం స్పెండ్​ చేయాలి.  వీటన్నింటితో పాటు చిరాకుగా అనిపించినప్పుడు సోషల్​ మీడియాకి దూరంగా ఉండాలి. 
  • మనసులో ఉన్న ఆలోచనలు పేపర్​పై పెట్టినా ఒత్తిడి నుంచి రిలీఫ్​ దొరుకుతుంది.  ఇష్టమైన పుస్తకాలు కూడా చదవొచ్చు.