విమానాల్లో పెరగనున్న లగ్జరీ ఫెసిలిటీ

విమానాల్లో పెరగనున్న లగ్జరీ ఫెసిలిటీ

పిండికొద్దీ రొట్టె అన్నట్టుగానే డబ్బుకొద్దీ లగ్జరీ కూడా దొరుకుతుంది. సాధారణంగా విమానాల్లో ఎకానమీ క్లాస్​కి బిజినెస్​ క్లాస్​ కీ చాలా తేడానే ఉంటుంది. ఖరీదు కూడా కాస్త ఎక్కువే. ఇకపై బిజినెస్​ క్లాస్​లో లగ్జరీ ఫెసిలిటీస్​ మరింత పెరగబోతున్నాయి. ఇప్పుడు విమానాల్లో బిజినెస్‌‌ క్లాస్‌‌లో ఉండే సీట్లను మినీ సూట్‌‌లా మార్చనున్నారు. వీటిని మరింత లగ్జరీగా తయారు చేస్తున్నారు. అంటే కాస్ట్‌‌లీ జర్నీలో కాస్ట్‌‌లీ సీట్లు ఉంటాయన్నమాట. అయితే వీటిని ఎయిసెల్‌‌ సీట్లుగా రూపొందిస్తున్నారు. అంటే ప్రతి విండో ముందు సీట్‌‌ వచ్చేట్టుగా అరేంజ్‌‌ చేస్తున్నారు. ఈ సీట్లలో కూర్చుంటే పక్కవారు కనపడరు. జేపీఏ డిజైన్స్‌‌ ద్వారా రివర్స్‌‌ హెరింగ్‌‌బోన్‌‌ సీట్‌‌ లే అవుట్లను తయారు చేసి, వాటికి అప్‌‌డేటెడ్‌‌ మోటార్స్‌‌ స్పోర్ట్‌‌ టెక్నాలజీ జతచేసి వీటిని రూపొందిస్తున్నారు. బరువు తక్కువగా ఉండే కార్బన్‌‌ పైబర్‌‌‌‌ మిశ్రమాలతో ఇవి రెడీ అవుతున్నాయి కనుక కర్బన ఉద్గారాలు కూడా పెద్దగా ఉండవు. పెద్దవైన బోయింగ్ 777 మోడల్స్​లోనే కాకుండా చిన్న ఎయిర్‌‌బస్ A321 నియోల్లో కూడా ఈ సీట్లను అరేంజ్‌‌ చేయవచ్చు.

2025 నాటికి అన్ని ఎయిర్ లైన్స్‌‌లో ఈ విలాసవంతమైన కొత్త బిజినెస్‌‌ క్లాస్​ సీట్లు రెడీ అవుతాయి. అయితే వీటి డిజైన్స్‌‌ ఇప్పటి నుంచి మొదలు పెడితేనే నాలుగేండ్లకు రెడీ అవుతాయంటున్నారు టీగ్‌‌ సీనియర్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆంథోనీ హార్కప్. అయితే ఖతార్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ వేస్‌‌ క్యూసూట్, డెల్టా వన్‌‌ సూట్‌‌, జెట్‌‌ బ్లూ వాళ్లు మినీ సూట్‌‌లా ఉండే మింట్‌‌ సీట్లను రెడీ చేస్తున్నారు. ఈ సూట్స్‌‌కు డోర్స్‌‌ కూడా ఉండి ప్రైవసీ కోరుకునే వారికి అనువుగా ఉంటాయి. కరోనా కారణంగా ఈ ఐడియా వచ్చిందని అంటున్నా.. 2016లో యునైటెడ్‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ పొలారిస్‌‌ సీట్లను తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. ఐదేండ్లు అవుతున్నా అవి పూర్తి కాలేదు. ఖర్చుతో కూడుకున్న పని కనుక వీటి తయారీకి ఎక్కువ టైమే పడుతుందని అంటున్నారు ఇంజనీర్లు. ఫ్లైట్స్‌‌లో ఈ సింగిల్ ఎయిసెల్‌‌ సీట్ల రెడీ అయితే మరింత సౌకర్యవంతమైన, మెరుగైన జర్నీ చెయ్యొచ్చు అంటున్నాయి ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీలు.