మాముత్​లు ​మళ్లొస్తే..?

మాముత్​లు ​మళ్లొస్తే..?

ఐస్‌‌ ఏజ్‌‌ సినిమా చూసే ఉంటారు. అందులోని సిద్‌‌ మాముత్‌‌(ఏనుగు జాతికి చెందినవి) అందరికీ గుర్తుండిపోతుంది. అయితే నిజంగానే అలాంటి మాముత్‌‌లు మళ్లీ వస్తే ఎలా ఉంటుంది. ఇదే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు అమెరికా సైంటిస్టులు. రీసెర్చ్‌‌ చేయడమే కాదు, 42,000 ఏండ్ల క్రితం ఐస్​ఏజ్‌‌లో నివసించిన జాతులను తిరిగి తీసుకురావచ్చు అంటున్నారు. అప్పటి పరిస్థితిల్లో ఉన్న మాముత్‌‌లను మళ్లీ పుట్టించొచ్చని, వాటి పిండాలను సేకరించామని, వాటి డీఎన్‌‌ఏతో తిరిగి ఫెర్టిలిటీని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. మాముత్‌‌లు యూరప్‌‌, ఉత్తర ఆసియా, ఉత్తర అమెరికా అంతటా ఉండేవి. సుమారు పది వేల సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పుల వల్ల అవి మెల్లిమెల్లిగా అంతరించిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌‌ ఇప్పుడు మొదలు పెడితే ఆరేండ్ల లోపు ఈ ఏనుగులను సృష్టించవచ్చట. ఇవి 11 నుంచి 12 అడుగుల పొడవు, 6 టన్నుల బరువు ఉంటాయని, ఈ ప్రాజెక్ట్‌‌ కోసం 15 మిలియన్‌‌ డాలర్లు ఫండింగ్‌‌ కూడా సేకరించామని సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి ఈ డీ ఎక్స్‌‌టింక్షన్‌‌ ఐడియా ఇప్పటిది కాదు. ఎన్నో ఏండ్లుగా శ్రమిస్తే ఇప్పటికొక దారికొచ్చింది. ఈ మాముత్‌‌లు చెట్లను కూల్చి ఆర్కిటిక్‌‌లో గడ్డి భూములు ఏర్పడ్డానికి తోడ్పడతాయి. అందువల్ల భూమి చల్లబడుతుంది. అయితే ఈ మాముత్‌‌లను తిరిగి తీసుకురావడమే కాదు, మళ్లీ అవి సంతానోత్పత్తి చేసేలా కూడా పరిశోధనలు చేస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మాముత్‌‌ల డీఎన్‌‌ఏను ఏషియన్‌‌ ఎలిఫెంట్లతో సరోగసీ గర్భం ద్వారా తిరిగి ఉత్పత్తి చేయొచ్చని అంటున్నారు. ఇవి గర్భం ధరించేందుకు 22 నెలలు, జాతి అభివృద్ధి చెందడానికి 30 ఏండ్లు పడుతుందని చెబుతున్నారు. మగ మాముత్‌‌లు 12 అడుగుల ఎత్తు ఉంటే ఆడవి కొంచెం చిన్నగా ఉంటాయి. వాటి తొండం 5 మీటర్ల పొడవు ఉండి తొండం చివర గడ్డిని తెంపేందుకు సహాయం చేసే రెండు వేళ్లు వంటివి ఉంటాయి. చిన్న చెవులు, పొట్టి తోక ఉండటం వల్ల శరీరంలోని వేడిని అవి కోల్పోకుండా ఉంటాయి. వీరి రీసెర్చ్​ ఫలిస్తే 
త్వరలో ఐస్​ఏజ్‌‌ను చూసే చాన్స్​దక్కుతుందేమో.