అమ్మకానికి 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల డేటా

అమ్మకానికి  50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల డేటా

న్యూఢిల్లీ: సుమారు 84 దేశాలకు చెందిన  50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఇన్‌‌‌‌ఫర్మేషన్ దొంగతనానికి గురయ్యిందని సైబర్‌‌‌‌‌‌‌‌న్యూస్ పేర్కొంది. ఈ ఇన్‌‌‌‌ఫర్మేషన్ పాపులర్ హ్యాకింగ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో అమ్మకానికి ఉందని తెలిపింది. ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించింది. ‘సైబర్‌‌‌‌‌‌‌‌న్యూస్ ఆరోపణలు నిరాధారమైనవి.  వాట్సాప్ నుంచి డేటా లీక్ అయినట్టు ఎటువంటి ఆధారాలు లేవు’ అని  వాట్సాప్ స్పోక్స్‌‌‌‌ పర్సన్  పేర్కొన్నారు. ‘వాట్సాప్ యూజర్ల డేటాను అమ్మకానికి ఉంచిన వ్యక్తి  యూఎస్‌‌‌‌కి చెందిన 3.2 కోట్ల మంది యూజర్ల డేటాను ఒక సెట్‌‌‌‌గా సేల్‌‌‌‌కు పెట్టాడు. అదే విధంగా ఈజిప్ట్‌‌‌‌, ఇటలీ, ఫ్రాన్స్‌‌‌‌, యూకే, రష్యా, ఇండియాలకు చెందిన లక్షల మంది యూజర్ల డేటా కూడా సెట్‌‌‌‌లుగా అమ్మకానికి ఉంచాడు’ అని సైబర్‌‌‌‌‌‌‌‌న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, యూఎస్  డేటా సెట్‌‌‌‌  రూ.5.74 లక్షలకు, యూకే డేటా సెట్ రూ. 2 లక్షలకు  అందుబాటులో ఉన్నాయి.

ఈ డేటా అమ్మేవాడిని సంప్రదించామని, యూకేకి చెందిన 1,097 నెంబర్లను శాంపిల్‌‌‌‌గా ఆయన పంపాడని  సైబర్‌‌‌‌‌‌‌‌న్యూస్ వివరించింది. ఈ నెంబర్లను దర్యాప్తు చేశాక ఇవి వాట్సాప్ అకౌంట్ నెంబర్లుగా తేలిందని పేర్కొంది. కానీ, ఈ డేటా తనకు ఎలా వచ్చిందో మాత్రం హ్యాకర్ బయటపెట్టలేదు. ఇలా దొంగతనానికి గురయిన డేటాను సైబర్‌‌‌‌‌‌‌‌క్రైమ్స్‌‌‌‌ మోసగాళ్లు వాడుతున్నారు. యూజర్లకు మెసేజ్‌‌‌‌ల ద్వారా లింక్‌‌‌‌లు సెండ్ చేయడం, వాటిని క్లిక్ చేయమని అడగడం వంటివి చేస్తున్నారు.  ఈ లింక్‌‌‌‌లను యూజర్లు క్లిక్ చేస్తే వారి క్రెడిట్‌‌‌‌ కార్డు లేదా పర్సనల్ డిటెయిల్స్‌‌‌‌ను దొంగలిస్తున్నారు. కిందటేడాది కూడా 50 కోట్ల మంది ఫేస్‌‌‌‌బుక్ యూజర్ల డేటా దొంగతనానికి గురయ్యిందని , ఇందులో 60 లక్షల మంది ఇండియన్‌‌‌‌ ఫేస్‌‌‌‌బుక్ యూజర్ల డేటా ఉందని   వార్తలు వచ్చాయి.