ఫింగర్ ప్రింట్‌ తో వాట్సాప్ లాక్

ఫింగర్ ప్రింట్‌ తో వాట్సాప్ లాక్

వాట్సాప్ పాస్‌వర్డ్ ఇక ఇతరులకు తెలిసినా పర్లేదు. ఇకపై ఇతరులు వాట్సాప్ మెసేజ్‌లు చూడటం కుదరదు. స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ ఎలా అత్యవసరం అయ్యిందో.. అలాగే స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ కూడా కంపల్సరీ అయ్యింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ అప్లికేషన్ కొనుగోలు చేసి వాట్సాప్‌ ను కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు అందిస్తోంది.

గత జనవరి నెలలో వాట్సాప్ సంస్థ కీలకమైన ప్రకటనను చేసింది. కస్టమర్లకు ఫింగర్ ప్రింట్ ద్వారా వాట్సాప్ యాప్‌లోకి ఎంటరైయ్యే ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అప్‌డేట్ చేయబడిన వాట్సాప్ యాప్‌లోని అకౌంట్ అప్లికేషన్‌లో ప్రైవసీ ఆప్లికేషన్‌ను క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ వుంది. దీన్ని ఆన్ చేస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది.

కస్టమర్లు తమ ఫింగర్ ప్రింట్‌ను ఇవ్వడం ద్వారా వాట్సాప్ లాక్ అవుతుంది. దీని ప్రకారం వాట్సాప్‌ను ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ మాత్రమే అవసరం అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌ను కస్టమర్లు తమ వాట్సాప్ లాక్‌గా ఉపయోగించుకోవచ్చు.