వాట్సాప్ లో కొత్త అప్ డేట్స్

వాట్సాప్ లో కొత్త అప్ డేట్స్

వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం తాజాగా తీసుకొచ్చిన బీటా అప్‌డేట్ లో  కంపానియన్ మోడ్‌, కొత్త గ్రూప్ ఫీచర్ ను విడుదల చేసింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తరహాలోనే వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్స్ ని పెంచింది. అయితే, ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే వాట్సా్ప్ బీటా వాడుతున్నవాళ్లకు అందుబాటులోకి ఉన్నాయి. త్వరలో రెగ్యులర్ వర్షన్ కి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

కంపానియన్ మోడ్ లో ఒక ఫోన్ లో ఉన్న వాట్సాప్ అకౌంట్ ని లాగ్ అవుట్ చేయకుండానే ఇంకొక ఫోన్ లో వాడుకోవచ్చు. కొత్త గ్రూప్ ఫీచర్స్ లో.. మామూలుగా గ్రూప్ లో మెసేజ్ చేసినవాళ్ల పేర్లు మెసేజ్ పక్కన కనిపిస్తాయి. అయితే ఈ కొత్త ఫీచర్ అప్ డేట్ లో మెసేజ్ పక్కన పేరుతో పాటు, ప్రొఫైల్ ఫొటో కూడా కనిపిస్తుంది.