WhatsApp new Feature: వాట్సాప్ కొత్త ఫీచర్.. పాస్వర్డ్ లెస్ పాస్కీ.. వివరాలివిగో..

WhatsApp new Feature: వాట్సాప్ కొత్త ఫీచర్.. పాస్వర్డ్ లెస్ పాస్కీ.. వివరాలివిగో..

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. మేసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తోంది. వినియోగదారుల సెక్యూరిటీని మెరుగుపర్చేందుకు పాస్ వర్డ్ లెస్ ‘పాస్ కీ’ నిఅందుబాటులోకి తెస్తోంది. ఎస్ ఎంఎస్ ల ప్రమానీకరణ అవసరాన్ని తొలగించడం ద్వారా భద్రత, సౌలభ్యం రెండింటిని మెరుగుపర్చడం లక్ష్యంగా ఈ ఫీచర్ ను తీసుకొస్తుంది. 

‘పాస్ కీ’ ఫీచర్ ..

ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫేస్, పిన్ లేదా వేలిముద్రల ఉపయోగించడం ద్వారా పాస్ కీలతో సురక్షితంగా తిరిగి లాగిన్ చేయవచ్చు. ఈ పీచర్ వాట్సాప్ బీటా ఛానెల్ లో టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పుడు ఇది సామాన్య కస్టమర్లకు అందుబాటులో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నెల రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే ఐఫోన్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తోంది ఇంకా సమాచారం లేదు. 

‘పాస్ కీ’ ముఖ్యాంశాలు..

 ‘పాస్ కీ’లు  వినియోగదారులు ఇప్పటివరకు వినియోగిస్తున్న పేరు, పాస్ వర్డ్ కలయికలకు సాంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది లాగిన్ ప్రక్రయను క్రమబద్దీకరించడమే కాదు.. భద్రతను పెంచుతుంది. ఫేస్ అథెంటికేషన్,ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, పిన్ అథెంటికేషన్లు ‘పాస్ కీ’లు. 

సాంప్రదాయ పాస్ వర్డ్ లతో వచ్చే ఫిషింగ్ దాడులకు అవకాశం లేకుండా చేయడంలో ఇది సహాయ పడుతుంది. ‘పాస్ కీ’లు క్లిస్ట పరిస్థితులో ఫ్లాట్ ఫారమ్ ను మరింత సురక్షితంగా చేస్తాయి. ఖాతాలను హ్యాకింగ్ చేసే అవకాశాలను తగ్గిస్తాయి. 

ప్రస్తుతం కొత్త పాస్ కీ  ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో వినియోగదారులకు పరిచయం చేయనుంది. పాస్ కీ లాగిన్ ప్రక్రియ భద్రత పెంచడం,  లాగాన్ ను సులభతరం చేస్తుందని కంపెనీ వర్గాలు చెపుతున్నాయి.